దీపిక నిర్మాతగా యాసిడ్‌ దాడి బాధితురాలి జీవిత చిత్రం

బాలీవుడ్‌లో ఒక పక్క సినిమాల్లో కథానాయికగా చేస్తూ నిర్మాతలుగా చేస్తున్న వారిలో ప్రియాంక చోప్రా, అలియా భట్‌ ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో దీపికా పదుకొనే కూడా చేరిపోయింది. ‘పద్మావత్‌’ విజయం తర్వాత ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ చేయడానికి అంగీకరించలేదు. త్వరలో ఈమె రణవీర్‌సింగ్‌ను పెళ్లాడబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదట. కానీ ఏదైనా సినిమా చేస్తే కొత్తగా వినూత్నంగా ఉండే కథలో చేయాలని అనుకుంటుంది. దాని కోసమే అన్వేషణ. ఇప్పటికే చాలా కథలు విన్నాది కానీ, ఏ ఒక్కటీ ఆమెకు నచ్చలేదు.ఇప్పుడు ఆమె యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మి జీవిత కధా చిత్రంలో నటించాలనుకుంటుందట.

ఇది కాకుండా ఆమె సొంతంగా ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించే పనిలో పడింది. దాని కోసం కొద్ది కాలం నుంచి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఆ బ్యానర్‌లో నిర్మించబోయే మొదటి చిత్రం మాత్రం మహిళ ప్రాధాన్య సినిమాయే కావడం విశేషం. అటువంటి కథ ఒకటి సిద్ధంగా ఉందట.యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మి జీవితాన్ని చిత్రంగా తీసే ఆలోచన చేస్తున్నారట. ఈ చిత్రానికి ‘రాజి’ దర్శకురాలు మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తారు. అలియభాత్ట్ ప్రధాన పాత్రలో నిర్మించిన రాజి చిత్రం విజయవంతమవ్వడమేకాదు.. విశేష ప్రశంసలందుకుంది. దీనికి దర్శకురాలు మేఘన గుల్జన సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అంటే ఈ ప్రొడక్షన్‌ బాధ్యతలన్నీ ఆవిడే చూసుకుంటారని మాట. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో  సెట్స్‌పైకి వెళ్లనుంది.