అతనికి సినిమా అంటే ఎంత పిచ్చో తెలిసింది !

సినిమా రంగం లో దర్శకుడి పాత్ర కీలకమైనది . కొందరు ఫార్ములా తో మ్యాజిక్ చేస్తుంటే …. మరికొందరు మంచి సినిమా కోసం తపిస్తుంటారు . ప్రస్తుతం తెలుగులో టాప్‌ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్న సుకుమార్‌ ఓ సందర్భంలో అగ్ర నిర్మాత దిల్‌ రాజు కాళ్ల మీద పడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజు వెల్లడించారు. ‘ఆర్య’ సినిమాలోని ఓ సీన్‌ కోసం దిల్‌ రాజును ఎంతో బతిమాలాడట సుకుమార్‌. అప్పుడే సుకుమార్‌కు సినిమా అంటే ఎంత పిచ్చో తెలుసుకున్నానని చెప్పారు దిల్‌ రాజు.

 ‘‘ఆర్య’ సినిమా కథ చెబుతూ… అందులోని ఓ మాంటేజ్‌ సీన్‌ నాకు చెప్పాడు. నాకు ఆ సీన్‌ చాలా నచ్చింది. అయితే సినిమా అంతా పూర్తయిపోయినా ఆ సీన్‌ తీయడం కుదర్లేదు. అనుకున్న బడ్జెట్‌ దాటిపోవడం, విడుదల తేదీ దగ్గరపడిపోవడంతో ఆ సీన్‌ తీయొద్దని చెప్పాను. దాంతో నన్ను ఓ గదిలోకి తీసుకొచ్చి నా కాళ్ల మీద పడ్డాడు సుకుమార్‌. ఆ సీన్‌ తీయడానికి ఒప్పుకుంటే తప్ప కాళ్లు వదలనని కూర్చున్నాడు. సుకుమార్‌కు సినిమా అంటే ఎంతో పిచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ’ అని చెప్పారు దిల్‌ రాజు.