తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `క‌లి`

“ఓకే బంగారం” సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయి ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో “మ‌హాన‌టి సావిత్రి’ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి `ఎంసిఎ` చిత్రంలో న‌టిస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా తెలుగులో విడుద‌ల కానుంది. దుల్క‌ర్ స‌ల్మాన్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్‌ చిత్రం `క‌లి`. ఈ సినిమాను తెలుగు అనువాద హ‌క్కుల‌ను ప్ర‌ముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ డి.వి.కృష్ణ‌స్వామి ద‌క్కించుకున్నారు.

ప్రస్తుతం తెలుగు అనువాదానికి సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆగ‌స్ట్ 2వ వారంలో ఈ సినిమా టైటిల్, లోగో విడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప‌లు ఉత్త‌మ చిత్రాల‌కు సంగీతం అందించి జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అవార్డ్స్ అందుకున్న గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ నెల‌లో సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.