ఎస్సేనుషియా సెలూన్ లాంజ్ ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డి

*హైద‌రాబాద్ అత్తాపూర్‌లో స‌రికొత్త అనుభూతితో కూడిన సెలూన్ లాంజ్*
*అందుబాటులోకి అధునాత‌న ప‌రిక‌రాలతో సేవ‌లు*
*ఆహ్లాదాన్ని క‌లిగించే వాతావ‌ర‌ణం ఏర్పాటు* 

హైద‌రాబాదీల‌కు స‌రికొత్త అనుభూతిని అందించే విలాస‌వంత‌మైన ఎస్సేనుషియా సెలూన్ లాంజ్‌ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అత్తాపూర్‌లో ప్రారంభించారు. అందాల ప్ర‌పంచంలో ఇది మ‌రో మెట్టు అని, వ్య‌క్తిగ‌త సౌంద‌ర్యం, కేశ సంర‌క్ష‌ణ కోసం అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పోటీ ప‌డే విధంగా, ఆధునిక ప‌ద్ద‌తుల్లో సేవ‌లు అందించేందుకు అత్తాపూర్‌లో ఏర్పాటు చేయ‌డాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి స్వాగ‌తించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సేనుషియా సెలూన్ లాంజ్ నిర్వ‌హ‌కులు స్వాతిరెడ్డిని అభినందించారు. స్త్రీల‌తో పాటు పురుషుల‌కు కూడా హెయిర్ క‌టింగ్, స్టైలింగ్, క‌ల‌రింగ్, ఫేషియ‌ల్, చేతులను, పాదాల‌ను అందంగా తీర్చిదిద్దే ప‌ద్ద‌తి, స్కిన్ కేర్.. ఇలాంటి ఎన్నో స‌ర్వీసులుతో కూడిన ఎస్సేనుషియా సెలూన్ లాంజ్‌ ఈ త‌రం యువ‌త‌కు చ‌క్క‌ని వేదిక అని టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. దూర‌ద‌ర్శ‌న్ మాజీ డైరెక్ట‌ర్ విజ‌య భ‌గ‌వాన్ ,ప్ర‌ముఖ న్యాయ‌వాది సురేష్ కుమార్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని నిర్వ‌హ‌కుల‌కు శుభాకాంక్ష‌లు అందించారు.

యువత ఆలోచ‌న‌ల త‌గిన రీతిలో సౌందర్య కాంక్షలను దృష్టిలో పెట్టుకొని నగరం నడి బొడ్డున ప్రపంచ స్థాయి సెలూన్ “ఎసెన్షియా సెలూన్ లాంజ్”ను ఏర్పాటు చేసిన‌ట్టు సెలూన్ లాంజ్ నిర్వ‌హ‌కులు స్వాతిరెడ్డి తెలిపారు. పురుషులకు, స్త్రీలకు ఆధునిక స్టైల్స్ లో, ఫ్యాషన్లలో సేవలు అందిస్తూ స‌రికొత్త ఫ్యాషన్ ప‌రిచ‌యం చేస్తామ‌న్నారు. యువ‌త‌రానికి నచ్చిన, మెచ్చిన సత్వర సంతృప్తికర సేవలు అందించడానికి ఆధునిక ఫ్యాషన్లలో ట్రైనింగ్ పొందిన ఎక్స్‌ప‌ర్ట్స్ త‌మ ద‌గ్గ‌ర ఉన్నార‌ని తెలిపారు. బెస్ట్ ప్రైస్, బెస్ట్ సర్వీస్ అందిస్తామ‌న్నారు. కొత్త టెక్నాల‌జీతో కూడిన‌ సెలూన్ ఇంటీరియ‌ల్‌, అధునాత‌న సీటింగ్, ఇటాలియ‌ను థీమ్ వంటివి క‌స్ట‌మ‌ర్‌ల‌కు ఎంతో అనుకూలంగా ఉన్నాయ‌ని, సెలూన్‌లో నెయిల్ టెన్ష‌న్స్, జెల్ పాలిష్, రిఫిల్స్ వంటి అనేక సేవ‌ల‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. స్నేహ‌పూర్వ‌క‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డంలో ఎస్సెనుషియా  సిబ్బంది ముందుంటార‌ని ఎస్సెనుషియా నిర్వ‌హ‌కులు స్వాతిరెడ్డి చెప్పారు. అంతేకాదు స్పెష‌ల్ మేక‌ప్‌తో పెళ్లికూతురును అందాల రాణిగా తీర్చిదిద్దుతామ‌న్నారు. గోళ్ల అందాన్ని ఇనుమడింపజేసేందుకు పెయింట్, డెకొరేట్ వంటి నెయిల్ ఆర్ట్ సేవలు అందిస్తున్నామ‌న్నారు.

కాఫీ, జ్యూస్ తాగుతూ, ఆహ్లాద‌క‌ర‌మైన సంగీతం వింటూ ఎస్సెనుషియా  స‌ర్వీసులు అందుకునే అవ‌కాశం ఇక్క‌డ మాత్ర‌మే లభిస్తుందని నటుడు సోహెల్ అన్నారు. చిన్నచిన్న లోపాలు కూడా బయటకి కనిపించకుండా చేసేందుకు హెయిర్ బ్రష్, హెచ్‌డీ మేకప్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నార‌ని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే సకల సాంకేతికత, నైపుణ్యత, సృజనాత్మకత, ప్రపంచ స్థాయి శిక్షణ పొందిన నిపుణులు అత్తాపూర్‌లో ఏర్పాటు చేయ‌డం సంతోషంగా ఉంద‌ని ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌లువురు సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్స‌ర్స్ తెలిపారు.