చిత్రసీమ ఒక అద్భుత ప్రపంచం !

సినీరంగం నా దృష్టిలో ఇదొక ‘అందమైన మాయా ప్రపంచం’ అని అంటున్నది చెన్నై సోయగం త్రిష. తన సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది త్రిష. ఆమె మాట్లాడుతూ…. సాధారణ ప్రజల్లో చాలా మందికి సినీరంగంపై సదాభిప్రాయం వుండదు. ఇక్కడందరూ అవకాశవాదులే వుంటారని అనుకుంటారు. కానీ సినీరంగం నా దృష్టిలో ఇదొక అందమైన మాయా ప్రపంచం.సినీరంగం నాకు ఎన్నో విషయాల్ని నేర్పించింది. సమాజంలో నాకు గొప్ప స్థాయిని సంపాదించిపెట్టింది. ఎందరో ఉన్నతమైన వ్యక్తుల్ని కలిసే భాగ్యాన్ని కలిగించింది. సినిమాలవల్లే లక్షల మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నాను. బయటి నుంచి చూసేవారికి ఈ రంగుల ప్రపంచం చెడ్డగా అనిపిస్తుంది. ఆ అభిప్రాయం తప్పు. చిత్రసీమ ఒక అద్భుత ప్రపంచం. ప్రతిభ వుంటే ప్రతి ఒక్కరిని ఎదగనిస్తుంది …అని చెప్పింది. స్టార్‌డమ్ గురించి చెబుతూ… అగ్ర కథానాయిక ఇమేజ్‌ను సంపాందించుకోవడం అంత కష్టమేమి కాదు. నా కెరీర్ మొదలైన మూడేళ్లలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాను. అయితే స్టార్‌డమ్‌ను సుదీర్ఘకాలం కొనసాగించడంలోనే కష్టం వుంటుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. కాబట్టి నెంబర్‌గేమ్ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నా ప్రతిభకు తగిన అవకాశాలొస్తున్నాయా? లేదా? అనే ఆలోచిస్తాను అని తెలిపింది.

ఇప్పుడు మలయాళం లోనూ త్రిష …

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఇప్ప‌టికి కుర్ర భామ‌ల‌కి పోటీ ఇస్తూనే ఉంది. తెలుగులో త్రిష జోరు కాస్త త‌గ్గిన‌ప్ప‌టికి త‌మిళంలో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తుంది. ఇక మ‌ల‌యాళంలోను ఈ అమ్మ‌డు ఆఫ‌ర్స్ అందుకుంటుంది. తొలి సారి మ‌ల‌యాళంలో ‘హే జూడ్’ అనే సినిమా చేస్తుంది త్రిష‌. మ్యూజికల్ రొమాన్స్ ఫిల్మ్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో హీరోగా ‘ప్రేమమ్’ ఫేం నివిన్ పౌలి న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో త్రిష చాలా సింపుల్‌గా టూ వీల‌ర్ పై ద‌ర్శ‌న‌మిచ్చింది. స్కూటీ పై హీరోతో త్రిష‌ ఏవో క‌బుర్లు చెబుతున్న‌ట్టు ఈ పోస్ట‌ర్ ఉంది. త్రిషా ఇన్నేళ్ల కెరీర్ లో తెలుగు – తమిళ్ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కన్నడ – హిందీలను కూడా టచ్ చేసింది. మరి ఇప్పుడు మలయాళం లో త్రిష హ‌వా ఏరేంజ్‌లో కొన‌సాగ‌నుందో చూడాలి. ప్ర‌స్తుతం త్రిష ’96’, ‘1818’, ‘గర్జనై’ అనే త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది.