“కళాతపస్వి”కి ఘన సన్మానం !

 

‘సాంస్కృతిక బంధు’ సారిపల్లి కొండలరావు సారథ్యం లో‘యువకళా వాహిని’ అధ్వర్యం లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ కాశీనాధుని విశ్వనాద్ గారికి జులై 5 న ప్రసాద్ ల్యాబ్ లో ఘన సన్మానం జరిగింది.

గౌ. తమిళనాడు పూర్వ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య గారు, ‘కళా భారతి’ జమున , సినీ నటి కవిత తదితరులు సన్మానించారు . సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించారు . సతీష్ వేగ్నేశ , యం వి ఎస్ హరనాద రావు , డాక్టర్ ఓలేటి పార్వతీశం , లయన్ విజయ కుమార్ ,కొత్త కృష్ణవేణి , హరి ప్రసాద్ విశ్వనాధుని గొప్పతనాన్ని గురించి మాట్లాడారు ..
సాంస్కృతిక సంస్థలు వంశీ ,అభినందన , మానస ఆర్ట్స్ , న్యూజెర్సి కల్చరల్ అసోసియేషన్స్ , సద్గురు ఆర్ట్స్ ,కనకదుర్గ నృత్య విభావరి , సత్యసాహితి , కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ,బాపు రమణ ఆర్ట్స్ , జిత్ మోహన్ మిత్ర గ్రూప్స్ ,కీర్తన ఆర్ట్స్ మొదలగు సంస్థలు విశ్వనాధుని సన్మానించాయి .

‘యువకళా వాహిని’ సంస్థ అధ్యక్షలు వై కె నాగేశ్వర రావు సభ కు స్వాగతం పలికారు .

సభలో ముఖ్య అధితిడాక్టర్ కొణిజేటి రోశయ్య గారికి జన్మదిన ఆత్మీయ సత్కారం జరిగింది . సభ ప్రారంభంలో కె . విశ్వనాధ్ చిత్రాల్లో ప్రేక్షకులను విశేషం గా అలరించిన పాటలను ఎస్వీ రామారావు వ్యాఖ్యానం తో ప్రదర్శించారు .