‘తప్పు చేశానే’ అని అదేపనిగా బాధపడను !

సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ని అవుతానని తనకు ముందే తెలుసని హన్సిక చెప్పింది. ఎందుకంటే తాను కఠినంగా శ్రమిస్తానని అంది. అందుకే తనను మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని, ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నటిస్తానని, అగ్ర కథానాయకినవుతానని తనకు ముందే  తెలుసంది. హన్సిక క్రేజీ కథానాయికే. స్టార్‌ ఇమేజ్‌ను హన్సిక సంపాదించుకున్నారు.ఆమె తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మంచి మార్కెట్‌ను అందుకుంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి కథానాయకిగా సెటిల్‌ అయిన నటి హన్సిక. దర్శకుల హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఖాతాలో విజయాల సంఖ్యే ఎక్కువ.అయితే ఇప్పుడు ఈ అమ్మడికి కాస్త క్రేజ్‌ తగ్గిందని చెప్పక తప్పదు. కారణాలేమైనా అవకాశాలు పలచబడ్డాయి.
 
“ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని హన్సిక చెప్పింది.
పలువురు లెజెండ్స్‌ను కలిసి మాట్లాడుతున్నానని… తప్పులు చేయడం సహజం .అయితే ‘తప్పు చేశానే’ అని దాన్నే తలుచుకుని బాధ పడుతూ కూర్చునే మనస్తత్వం తనది కాదని చెప్పింది. తాను గత ఏడాది 19 చిత్రాల ను నిరాకరించినట్లు చెప్పింది. ఇంతకుముందు ఏడాదికి 8 చిత్రాల వరకూ చేసేదాన్నని, ఇప్పుడు ఏడాదికి 4 చిత్రాలే చేస్తున్నానని తెలిపింది. అలాగని పనిలేకుండా ఖాళీగా ఉంటున్నట్లు భావించరాదని అంది. ప్రస్తుతం రెండు చిత్రాలను పూర్తి చేసి మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు హన్సిక తెలిపింది.
‘మహా’ హీరోయిన్‌ సెంట్రిక్‌ గా ఉంటుంది
యాభైవ చిత్రం ‘మహా’ లో నటించబోతుండడం చాలా సంతోషంగా ఉందంది…హన్సిక మాట్లాడుతూ. మహా చిత్ర కథ హీరోయిన్‌ సెంట్రిక్‌తో కూడి ఉంటుందని చెప్పింది. ఇలాంటి కథా చిత్రంలో నటించడం ఇదే ప్రప్రథమం అని తెలిపింది. అందుకే ఇందులో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంది.ఈ చిత్రం బాగా వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పింది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లో మరో రౌండ్‌ కొట్టడం ఖాయం అనే నమ్మకాన్ని నటి హన్సిక వ్యక్తం చేస్తోంది. మహా చిత్ర దర్శకుడు జమీల్‌ తనకు ముందే తెలుసని చెప్పింది. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పడానికి ఆరు నెలలు ఎదురు చూశారని, తాను బిజీగా ఉండడంతో ఆయన్ని కలిసి కథ వినడం కుదరలేదని తెలిపింది. ఎట్టకేలకు ఒక సమయంలో దర్శకుడు తనను కలిసి కథ వినిపించారని, అయితే అప్పుడు అందులో నటించడానికి అంగీకరించలేదని అంది. రెండవసారి మరోసారి కథ చెప్పినప్పుడు ఓకే చెప్పానంది. అయితే ముందు కథ విన్నప్పుడే ‘మహా’ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.
ఇంతకుముందు ‘రోమియో జూలియట్, బోగన్‌’ సినిమాలను డైరెక్ట్‌ చేసిన లక్ష్మణ్‌ వద్ద జమీల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌ హన్సికనే కావడం విశేషం. ‘‘హన్సిక ల్యాండ్‌ మార్క్‌ సినిమాను డైరెక్ట్‌ చేయనుండటం ఆనందంగా ఉంది. స్క్రిప్ట్‌ వర్క్‌ ఆల్మోస్ట్‌ పూర్తయింది. సెప్టెంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జమీల్‌.