అదే పాత్రను సొంత సినిమాలో వాడేసారు !

భారీ బడ్జెట్ తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు  ఏదో ఒక కారణంతో చిక్కుల్లో పడుతున్నాయి. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి.తాజాగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న “జై లవ కుశ” పై ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా విషయంలో దర్శకుడు  పూరి జగన్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది…

“టెంపర్” సినిమా సక్సెస్ తరువాత ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాలని భావించిన పూరి, ఓ క్యారెక్టర్ ఎన్టీఆర్ కి వినిపించాడట. అయితే అప్పట్లో పూరి సినిమాకు నో చెప్పిన ఎన్టీఆర్.. అదే క్యారెక్టర్ “జై లవ కుశ” సినిమా కోసం కాపీ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన “జై లవ కుశ” టీజర్ లో ‘జై’ ని చూసిన పూరి..”ఇది తాను సృష్టించిన క్యారెక్టర్ అని, తన పర్మిషన్ లేకుండా ఎన్టీఆర్ ఆ క్యారెక్టరైజేషన్ కాపీ చేశా”డని ఫీల్ అవుతున్నాడట. మరి ఈ వార్తలపై “జై లవ కుశ” ఎన్టీఆర్ సమాధానం చెప్పాలి ..