జలియన్ వాలా బాగ్ : ఓ కన్నీటి చీకటి దినం !

హైదరాబాద్: ‘జలియన్ వాలా బాగ్ ఉదంతం ఓ కన్నీళ్ల చీకటి దినం అని , జెనరల్ డయెర్ పైశాచిక చర్యను చరిత మరచి పోదని, జలియన్ వాలా బాగ్ శతాబ్ది సందర్భంగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ హిందీ, పంజాబీ, తెలుగు భాషల్లో నీరాజన, స్ఫూర్తి గీతాలను రూపొందించడం అభినందనీయం’… అని పూర్వ కేంద్ర మంత్రి యూవీ కృష్ణం రాజు అన్నారు.
‘జలియన్ వాలా బాగ్ యదార్ధ ఘటనను ప్రాధమిక విద్య లో తప్పక ఓ పాఠ్యసంగా చేర్చాలని అందువల్ల రాబోయే తరాలవారికి స్ఫూర్తి దాయకం గా వుంటుందని, ప్రముఖ భారతీయ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు .
తొలుత సభలో గజల్ శ్రీనివాస్ త్రిభాషల్లో గానం చేసిన గీతాలను రెబల్ స్టార్ కృష్ణం రాజు, విజయేంద్ర ప్రసాద్ లు ఆవిష్కరించారు. గీతాలకు సాహిత్యాన్ని అందించిన కల్నల్ తిలక్ రాజ్ ,జలంధర్ , సిరాశ్రీ లను అభినందించారు. ఈ సభలో సినీ ప్రముఖులు ‘డమరుకం’ శ్రీనివాస్ రెడ్డి, రామసత్యనారాయణ, మధుర శ్రీధర్ ,సంఘ సేవకులు పెనుమచ్చ వెంకట్రాజు, సీహెచ్ శ్రీనివాసరాజు, వాసు రాజు , రాజీవ్ రెడ్డి లు గౌరవ అతిధులుగా పాల్గొన్నారు