కన్నడ “కురుక్షేత్ర” లో ద్రౌపది ఈమేనా ?

తాజాగా మహాభారతానికి మరోసారి తెరకెక్కే సమయం ఆసన్నమైంది.మన పురాణ ఇతిహాసాల్లో ప్రధానమైన రెండింటిలో ఒకటి “మహాభారతం”.ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌లో రూపొందనుంది. మహాభారత ఇతివృత్తంతో కన్నడంలోనూ ఒక చిత్రం నిర్మాణానికి సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఎంటీ.వాసుదేవన్‌ రాసిన ‘రెండముళం’ అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహించనున్నారు.

ఇందులో దుర్యోధనుడిగా దర్శన్, కర్ణుడిగా రవిచంద్రన్, భీష్ముడిగా సీనియర్‌ నటుడు అంబరీష్‌ నటించనున్నారు. ఈ చిత్రానికి ‘కురుక్షేత్ర’ అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఇక కురుక్షేత్రానికి కీలక పాత్రధారిని పాంచాలిగా దక్షిణాది  అగ్రనాయకి నయనతారను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. నయనతార ఇప్పటికే “సూపర్‌” అనే చిత్రం ద్వారా కన్నడ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇప్పటికే ” శ్రీరామరాజ్యం”లో సీతగా నటించి ఆ పాత్రలో ఒదిగిపోయిన నయనతార “కురుక్షేత్ర”లో ద్రౌపదిగా నటిస్తే ఆ చిత్ర స్థాయిబాగా పెరిగిపోతుందని అంతా అభిప్రాయపడుతున్నారు .