‘రచయితల సంఘం’ టీజర్‌ ఆవిష్కరించిన ‘రెబల్ స్టార్’

‘రచయితల సంఘం’ రజతోత్సవ వేడుక నవంబర్‌3న జరగనుంది. ఈ సందర్భంగా కర్టెన్‌ రైజర్‌గా వేడుకకు సంబంధించిన టీజర్‌ను కృష్ణంరాజు ఆవిష్కరించారు…’నాన్నగారు ఓ మాట చెప్పేవారు… లక్ష్మీ ఎదురువస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి నమస్కరించు. అందుకే రచయితల వేడుకకు వచ్చానని” ‘రెబల్‌స్టార్‌’ కృష్ణంరాజు అన్నారు.రచయితల సంఘమంటే సరస్వతీ పుత్రుల సంఘమని, అలాంటి సంఘం లక్ష్మీ దేవి కటాక్షంతో అద్భుతమైన స్వంత భవనం కట్టుకోవాలని..అన్నారు. రచయితలకు కాన్‌సన్‌ట్రేషన్‌..అంకితభావం వుండాలి. కాలంతోపాటు రచనల్లో మార్పు వచ్చింది.  పిల్లలకు మనం ఏది చెబితే దాన్నే ఆచరిస్తారు. అదేవిధంగా రచయితలు రాసిన మాటలే ప్రేక్షకుల్లో పాపులర్‌ అవుతాయి. కనుక, అవి మంచికి దోహదపడేలా వుండాలి… కృష్ణంరాజు అన్నారు
 
బలభద్రపాత్రుని రమణి స్వాగతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు సంఘం తొలినాటి విశేషాలను వివరించారు. 
అధ్యక్షుడు డా.పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..
సంఘం కార్యకలాపాలు, నవంబరు మూడున ‘ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్’ లో జరగనున్న రచయితల సంఘం రజతోత్సవ విశేషాలని వివరించారు. సినిమా పుట్టుపూర్వోత్తరాలను వివరించారు.
ఎస్‌.వి.రామారావు మాట్లాడుతూ.. సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు.
నాగబాలసురేష్‌ మాట్లాడుతూ.. 1951 నుంచి 60 వరకు జరిగిన సినిమాల గురించి వాటిలో రచయితలు, దర్శకుల గురించి వివరించారు.
వడ్డేపల్లి కృష్ణ తెలుపుతూ.. 1961-70 కాలంనాటి చరిత్రను తెలియజేశారు. సినారె లాంటి గొప్ప గొప్ప కవులది కూడా ఈ దశాబ్ధమేనని తెలిపారు.
చిలుకుమార్‌ నట్‌రాజ్‌ మాట్లాడుతూ… 1971-80 క్రమాన్ని వివరించారు. ఈ దశాబ్ధంలో స్క్రీన్‌ప్లేలో చాలా మార్పులు వచ్చాయి. పాతరం, కొత్తరం రచయితలు కలిసి ముందుకు వెళ్ళిన దశాబ్ధం ఇదేనని పేర్కొన్నారు.
ఉమర్జీ అనూరాధ తెలుపుతూ.. 1981-90వరకు రచయితలు, దర్శకులు నిర్మాత గురించి తెలియజేశారు. టి. కృష్ణ, ఆర్‌.నారాయణమూర్తి వంటివారి చిత్రాలతోపాటు పలు చిత్రాలను విశ్లేషించారు. ఇంకా రత్నబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.