కుప్పిలి శ్రీనివాస్ సెక్సీ స్టార్ పోస్టర్ లాంచ్ చేసిన సుమన్

కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం “సెక్సీ స్టార్”. ఓ కొడుకు వ్యధ అనేది ట్యాగ్ లైన్ .చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్  నిర్మిస్తున్న  ఈ చిత్రానికి  కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటులు సుమన్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేశారు.

సుమన్ మాట్లాడుతూ.. ”  కుప్పిలి శ్రీనివాస్ కు మంచి టెస్ట్ ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఈ సినిమా కథ తండ్రీకొడుకుల మధ్య సెంటిమెంట్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం  ప్రతిఒక్కరికి నచ్చుతుంది” అని తెలిపారు. ఈ కథను తెలుగుతో పాటు మిగతా భాషల్లో డబ్బింగ్ చెయ్యాలని చిత్రయూనిట్‌ను ఆయ‌న‌ కోరారు.

కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నా అభిమాన హీరో సుమన్ గారు మా సినిమాలో నటించడమే కాదు. మూవీ పోస్టర్ లాంచ్ చేయడం సంతోషగా ఉంది” అన్నారు. ఈ సినిమాను చాలా ఇష్టంగా చేశాను. మంచి టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేసాము అని తెలిపారు.

రచయిత శివప్రసాద్ ధరణ కోట ,సంగీత దర్శకులు జై సూర్య, ఫైట్ మాస్టర్ హంగామా కృష్ణ , కెమెరా మెన్ పొడిపై రెడ్డి శ్రీను , గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

సమర్పణ : చిన్ని కుప్పిలి, కథ ,నిర్మాత: లయన్ కుప్పిలి వీరచారి, కుప్పిలి శ్రీనివాస్ ,హ్రితిక సింగ్ , సాధన పవన్  ఇందులో హీరో హీరోయిన్లు. రచయిత: శివప్రసాద్ ధరణికోట, డి.ఓ.పి: పొడిపై రెడ్డి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్: జై సూర్య, ఎడిటర్  ప్రణీత ,ఎన్టీఆర్.