ఉర్రూతలూగించిన ‘మహతి మ్యూజిక్ అకాడమి’ సదా బహార్ నగ్మే

ప్రముఖ సంగీత, సాహిత్య సంస్థ ‘మహతి మ్యూజిక్ అకాడమి’ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఆణిముత్యాల వంటి హిందీ గీతాలతో ‘సదా బహార్ నగ్మే’ పేరిట ‘సంగీత విభావరి’ని త్యాగరాయగాన సభలో వైభవంగా అందించారు. ప్రముఖ గాయకులూ,సంగీత దర్శకులు డా.చిత్తరంజన్ నిర్వహణలో మహా భాష్యం కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖ గాయకులు పాల్గొన్న ఈ పాటల కార్యక్రమం సంగీత ప్రియులను విశేషంగా అలరించింది.
సంస్థ కార్యదర్శి .. వృత్తి రీత్యా డాక్టర్,ప్రవృత్తి రీత్యా గాయకులయిన.. మధురగాయకులు, ‘గాన రత్న’ డా.యం.విజయకుమార్ నేతృత్వంలో మురళీకృష్ణ,రఘురాం,దిల్ మహమ్మద్ ఖాన్,కౌశిక్,వందనా పవన్ ,మహతి,అమృతవల్లి,మాస్టర్ కార్తీక్,గాయత్రి,వైష్ణవి,లహరి,శ్రీనిధి,అలేఖ్య పాడారు. ‘సీమ’,’జువెల్ తీఫ్’,’శివ 2006′, ‘దో ఫూల్’,’ఆనంద్’,’బర్ఫీ’,’వక్త్’ మొదలైన చిత్రాల్లోని గీతాలను మధురంగా ఆలపించారు. ఇందులో లతా మంగేష్కర్,మహమ్మద్ రఫీ,మన్నాడే,హేమంత్ కుమార్, కిషోర్ కుమార్, ఆర్.డి.బర్మన్,ముఖేష్, ఆశ భోస్లే పాడిన పాటలున్నాయి.