కొత్త సినిమా షూటింగ్ మొత్తం న్యూయార్క్‌లోనే !

‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మహేష్‌బాబు. ఈ సినిమాలో అతను తొలిసారి ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడు. మహేష్‌కు ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక రాజకీయ నాయకుడిగా ఈ సూపర్‌స్టార్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ ఇదివరకే ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.  అతను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అందులో హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటించనుంది. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది… ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూయార్క్‌లో జరుగబోతోందట. అంటే ‘భరత్ అను నేను’ సినిమాతో పోలిస్తే ఇది పూర్తిగా డిఫరెంట్ ఎంటర్‌టైనర్ అన్నమాట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే మే చివరి వారం నుంచే షూటింగ్ మొదలవుతుంది. ఈలోపే ‘భరత్ అను నేను’ సినిమా విడుదలైపోతుంది. ఇక మహేష్ కొత్త చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే అతను అన్ని పాటలకు ట్యూన్లు కట్టేశాడట. ఎలాగైనా సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్. అశ్వనీదత్, దిల్‌రాజ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ కోసం సినిమా టీమ్ అంతా ఒక్కసారిగా అమెరికా వెళ్లి షూటింగ్ అంతా పూర్తిచేసుకున్న తర్వాత ఇండియాలోకి అడుగుపెడుతుందట.