అందరూ మెహ్రీన్ కావాలంటున్నారు !

‘కృష్ణ గాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయింది. ఈ మధ్య ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్…’జవాన్’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఈ అమ్మడు భావిస్తుంది. అయితే ఇప్పుడు  గోపిచంద్ సరసన నటించే ఛాన్స్ మెహరీన్ కి వచ్చిందని అంటున్నారు. కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్ లో గోపిచంద్ ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో మెహరీన్ ని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారట. మరి దీనిపై పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది. మెహరీన్ తన హవా ఇలానే కొనసాగిస్తే రానున్న రోజులలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమని అంటున్నారు.

ముందుగానే డిసైడ్‌ అయ్యాడట!

వరస హిట్లతో దూసుకుపోతున్న మెహ్రిన్‌కు టాప్ దర్శకుల నుంచి మంచి అవకాశాలే వస్తున్నాయి. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాల్లో మెహ్రిన్ నటించి సూపర్ హిట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.  ఆమె నటనకు ఫిదా అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  తన సినిమాలో నటించడానికి డేట్లు ఇవ్వమంటూ మెహ్రిన్‌కి ఫోన్ల మీద ఫోన్లు చేశాడట! ఇంతకీ అసలు సంగతేమిటంటే …. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాలో మెహ్రిన్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్‌ ముందుగానే డిసైడ్‌ అయ్యాడట! కానీ ‘మహానుభావుడు’ హిట్‌ తరువాత మెహ్రీన్‌ డైరీ ఫుల్ అయిందట! డేట్లు అడ్జస్ట్‌ చేయలేక కొన్ని సినిమాలు వదలుకుందట కూడా! ఈ క్రమంలోనే త్రివిక్రమ్‌ సినిమా కూడా వదులుకోవాలని అనుకుందట! కానీ త్రివిక్రమ్‌ చాలా సార్లు ఫోన్ చేసి డేట్లు అడ్జస్ట్‌ చేయమని అడగడంతో ఆయన సినిమా చేయాలని మెహ్రీన్‌ డిసైడ్‌ అయిందట!