‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ లిస్ట్ లో నెంబర్ వన్

2017 లో నెంబర్ 2 వ ప్లేస్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ 2018 లో నెంబర్ 1ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు 2019 లో అదే స్థానం నిలబెట్టుకున్నాడు .2020 లో కూడా తానే నెంబర్ 1 గా నిలుస్తానని ధీమా వ్యక్తంచేశాడు. సౌత్ ఇండియాలో ‘వన్ ఆఫ్ ది క్రేజీ హీరో’ విజయ్ దేవరకొండ కు ‘హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019’ లిస్ట్ లో నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది .విజయ్ యాటిట్యూడ్, డ్రెస్సింగ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లోచేరేలా దోహదపడ్డాయి. తక్కువ సమయంలో యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ కెరీర్ మొదట్లోనే హ్యాట్రిక్ హిట్స్ ను సొంతం చేసుకున్నాడు .రొటీన్ కు భిన్నంగా స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకోవడం..చేసే వర్క్ కాన్ఫిడెన్స్ గా పూర్తి చేయడం .. వంటివి తన సక్సెస్ కు సీక్రెట్స్ గా విజయ్ దేవరకొండ భావిస్తాడు. ఫ్యాషన్ విషయానికి వస్తే ‘తన ఆలోచనే తాను వేసుకునే డ్రెస్ సెన్స్ ను డిసైడ్ చేస్తుందని అదే ఫ్యాషన్’.. అంటున్నాడు విజయ్ దేవరకొండ.
 
‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019’ సమంత
మొత్తం 30 మంది సెలబ్రిటీలతో కూడిన జాబితాలో 10 మంది కొత్తవాళ్లకు చోటుదక్కింది. ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019’ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నది సమంత అక్కినేని. నాగచైతన్యను పెళ్లిచేసుకున్న తరవాత సమంత క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరిగింది. ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి సినిమాలు చేసి సోలోగా సినిమాలను నడిపించగలననే నమ్మకాన్ని ప్రేక్షకులకు కలుగజేసింది సమంత. తెలుగు ప్రేక్షకుల ఓట్లు కూడా సమంతకే ఎక్కువగా రావడంతో ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019’గా నిలిచింది అక్కినేనివారి కోడలు.
మొత్తం 30 మంది సెలబ్రిటీలతో కూడిన ఈ జాబితాలో 10 మంది కొత్తవాళ్లకు చోటుదక్కింది. మిగిలిన వారంతా గతేడాది జాబితాలో ఉన్నవారే. కొందరి స్థానాలు పైకి.. కిందికి మారాయి. వీరిలో 17మంది హీరోయిన్లు కాగా.. మిగిలినవారు వివిధ రంగాలకు చెందినవారు.
‘మిస్ ఇండియా తెలంగాణ 2019’గా నిలిచిన సంజనా విజ్ తొలిసారి ఈ జాబితాలో చోటుదక్కించుకున్నది. ఇండియన్ అమెరికన్ సాంగ్ రైటర్, ర్యాపర్ రాజా కుమారి తొలిసారి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2019 నికిత తన్వాని, నిజామాబాద్‌కి చెందిన బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీన్ కూడా ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకోవడం విశేషం. ఇది 40 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళా సెలబ్రిటీల జాబితా.