ఆన్ లైన్ లో విడుదలకు సినిమాలు వరుసకట్టాయి!

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న చిత్రాలను లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పుడు థియేటర్లలోకి విడుదల చేసినా వాటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు రాకపోవచ్చునని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. అందులోనూ తక్కువ బడ్జెట్‌ చిత్రాలైతే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మేలనే భావనలో ఉన్నారు.ఇటీవలే హాలీవుడ్‌ చిత్రం ‘ఎక్షాట్రాక్షన్‌’ నెట్‌ఫ్లిక్స్‌పై విడుదలైంది. జాక్విలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించిన ‘సీరియల్‌ కిల్లర్‌’ కూడా వచ్చింది. ఈ రెండు చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. వీటికి ముందు ’83’ కూడా ఓటీటీపైనే విడుదల చేయాలనుకున్నా… ఆ చిత్రానికి పెట్టిన పెట్టుబడి రాకపోయేసరికి వెనక్కి తగ్గారు. ఆ వరుసలో అక్షరు కుమార్‌ నటించిన ‘లక్ష్మీబాంబ్‌’ చేరింది. ఈ చిత్రం రైట్స్‌ అమ్మకాల కోసం చర్చలు జరుగుతున్నాయి.మరో రెండు బాలీవుడ్‌ చిత్రాలు ఓటీటీపై రావడానికి రెడీ అయ్యాయి. అందులో అభిషేక్‌ బచ్చన్‌, రాజ్‌కుమార్‌ రావు ముఖ్యపాత్రలు పోషించిన ‘లడో’, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘ఝుంద్‌’ చిత్రాల విడుదల హక్కులను ఆ సినిమా నిర్మాతలు అమెజాన్‌ ప్రైమ్‌కు విక్రయించారు. ఈ రెండు చిత్రాలనూ టీ సిరీస్‌ బ్యానర్‌ నిర్మించింది. లాభాలు రాకపోయినా పెట్టిన పెట్టుబడి అయినా పొందాలన్న ఉద్దేశంతోనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ సినిమాలను విడుదల చేసేందుకు అంగీకరిస్తున్నట్టు టీ సిరీస్‌ పేర్కొంది.
అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా ‘గులాబో సీతాబో’ కాకుండా…అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఉదయం వివిధ భాషల నుండి ఏడు చిత్రాలను డైరెక్ట్ ఆన్ లైన్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యాబాలన్ నటిస్తున్న ‘శకుంతల దేవి’ ఈ ఏడు సినిమాలలో ప్రముఖమైనది. దాని విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కీర్తి సురేష్ తమిళ,తెలుగు చిత్రం ‘పెంగ్విన్’ జూన్ 19 న విడుదల కానుంది. జ్యోతిక ‘పోన్మగల్ వంధల్’ మే 29 న అమెజాన్ లో విడుదల అవుతుంది. అలాగే కన్నడ చిత్రం ‘లా’ జూన్ 26 న విడుదల కానుంది, మరో కన్నడ చిత్రం ‘ఫ్రెంచ్ బిర్యానీ’ జూలై 24 నుండి స్ట్రీమ్ అవుతుంది. ‘లా’ , ‘ఫ్రెంచ్ బిర్యానీ’ రెండూ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించినవి. అదితి రావు హైదరి ‘సుఫియం సుజాతయం’ థియేటర్ విడుదల కాకుండా ఆన్ లైన్ లో వచ్చే మొట్టమొదటి మలయాళ చిత్రం అవుతుంది. దాని విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. తెలుగులో ఇప్పటికే ‘అమృతారామం’ అనే సినిమా ఇప్పటికే డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల అయ్యింది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ తెలుగు సినిమా ఏదీ ఆన్ లైన్ లో విడుదల కాలేదు. అనుష్క నటించనున్న ‘నిశ్శబ్దం’ విడుదలకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుపుతుందట.
 
నాజీవితంలో పొందిన అనుభవాలు
సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గులాబో సితాబో’. అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ కురానా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. బాలీవుడ్‌లో ఓ పెద్ద సినిమా ఓటీటీపై విడుదల కావడం ఈ చిత్రంతోనే మొదలైంది. ఈ సందర్భంగా సూజిత్‌ సర్కార్‌ మాట్లాడుతూ .. ”నేను జీవితంలో పొందిన అనుభవాలు, కొన్ని సంఘటనలు నేర్పిన పాఠాలే నా సినిమాలు. నేను రూపొందించిన ఏ చిత్రం చూసినా అవే స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.నా సినిమాలు నా జీవితంలో జరిగిన సంఘటనలపైనే ఎక్కువగా ఉంటాయి. నాకు నేర్పిన జీవిత పాఠాలకు హాస్యాన్ని రంగరించి వ్యంగ్యంగా మలుస్తాను. ‘విక్కీ డోనర్‌’ విడుదలప్పుడు ఇది యంగ్‌ స్టర్స్‌ సినిమా అన్నారు. కానీ అందరూ చూశారు. ‘పికు’, ‘అక్టోబర్‌’, వంటి చిత్రాలూ అలానే ఉంటాయి. సినిమాల్లో లాక్‌డౌన్‌ సంస్కృతిగానూ, స్ఫూర్తిగా నడిచే కథలు రాబోతున్నాయి. ‘అక్టోబర్‌’ తర్వాత అయుష్మాన్‌, అమితాబ్‌తో ‘గులాబో సితాబో’ చేశాను. దీనికి కథ అందించిన జుహి చావ్లా, నిర్మాత రోనీ అంత పాతవాళ్లమే. మేం నిత్య జీవితంలో ఎలా ఉంటామో సెట్‌లో కూడా ఆ మాదిరిగానే ఉంటాం’ అని తెలిపారు.
 
కీర్తి సురేష్’పెంగ్విన్’ జూన్ 19 నుండి
‘మహానటి’తో జాతీయ అవార్డ్ దక్కించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్‌ ‘పెంగ్విన్‌’. తెలుగు, తమిళ భాషల్లో నూతన దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మించారు. ఇందులో గర్భవతి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్‌ ఊటీలో జరిపారు. ఈ సినిమా విడుదల కరోనా కారణంగా అయోమయంగా మారింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు
.జూన్ 19 నుండి సినిమా ఓటీటీ లో ప్ర‌సారం కానుంది.