‘పాతికేళ్ళు పూర్తి వేడుక’ లండన్ లో …

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ త‌న సంగీత ప్రయాణం లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా లండ‌న్ లో భారీ వేడుక జ‌రిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. జూలై 8న ‘నేట్రు ఇంద్రు నాలై’ పేరుతో ఓ మ్యూజిక్ కాన్స‌ర్ట్ ఏర్పాటు చేసి త‌న ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంట‌ర్ టైన్ చేయ‌నున్నాడ‌ట‌ ఈ డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ . పాపుల‌ర్ సింగర్స్ హ‌రిచ‌ర‌ణ్‌, జోనిత గాంధీ, బెన్ని ద‌యాల్, నీతి మోహ‌న్, రంజిత్ బరోట్ మ‌రియు జావేద్ అలి రెహ‌మాన్ తో  ఈ వేదిక పంచుకోనున్నారు. అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నున్న ఈ సెల‌బ్రేష‌న్స్ ని ప‌లు మీడియా సంస్థ‌లు లైవ్ టెలికాస్ట్ చేసేందుకు పోటి ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఎఆర్ రెహ‌మాన్ ‘2.0’ చిత్రంతో పాటు , విజ‌య్ ‘మెర్సిల్’, జ‌యం ర‌వి ‘సంఘ‌మిత్ర’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.