షూటింగ్ పూర్తి చేసుకున్న నాగార్జున అక్కినేని `మ‌న్మ‌థుడు 2`

‘కింగ్’ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.  చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుద‌ల‌ను త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మంగ‌ళవారం ఈ సినిమాలో అవంతిక పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ క్యారెక్ట‌ర్‌ను ప్రోమో రూపంలో రిలీజ్‌ చేశారు.

న‌టీన‌టులు:
కింగ్ నాగార్జున‌,,ర‌కుల్ ప్రీత్ సింగ్‌
ల‌క్ష్మి,వెన్నెల‌కిషోర్‌,రావు ర‌మేష్‌
ఝాన్సీ,దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: 
ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌,సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌
స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌, ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని