నిఖిల్ `అర్జున్ సుర‌వ‌రం` న‌వంబ‌ర్ 29న

యువ హీరో నిఖిల్ తో.. ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో..టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం`. ఈ చిత్రం విడుద‌ల విష‌యంలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. న‌వంబ‌ర్ 29న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.
నిఖిల్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించింది. ఈ సినిమా టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు.