సెప్టెంబర్ 10 న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ ట్రైలర్ లాంచ్ !

వరుస విజయాలతో  దూసుకుపోతోన్న  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం ‘జై లవ కుశ’ .  యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రానికి ఇప్పటికే మార్కెట్ లో విశేషమైన ఆకర్షణ ఉన్న సంగతి తెలిసినదే. “జై”, “లవ కుమార్” టీజర్ ల కు సోషల్ మీడియా లో రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి.
ఈ చిత్రం ఆడియో ను సెప్టెంబర్ 3 న డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తొలుత భారీ స్థాయి లో ఆడియో ఫంక్షన్ ను ప్లాన్ చేసినప్పటికీ, భారీ వర్ష సూచన తో పాటు, వినాయక నిమ్మజ్జనం లో పోలీస్ శాఖ నిమగ్నమై ఉండటం తో, అభిమానుల భద్రత కి ప్రాధాన్యం ఇస్తూ, డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
సెప్టెంబర్ 10 న, హైదరాబాద్ లో అభిమానుల మధ్య, “జై లవ కుశ” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, ” సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై “జై లవ కుశ” చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతోనిర్మించాం. అభిమానుల భద్రత కి ప్రాధాన్యం ఇస్తూ , ఆడియో ని డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేస్తున్నాం. కానీ ట్రైలర్ ను మాత్రం అభిమానుల నడుమ సెప్టెంబర్ 10 న హైదరాబాద్ లో విడుదల చేస్తాం ” అని అన్నారు.
 కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)
NTR’s “Jai Lava Kusa” Trailer Launch event on September 10th. Audio Direct Release on September 3rd
Young Tiger NTR who is on a roll with back to back hits, has teamed up for the prestigious project “Jai Lava Kusa” with his brother Nandamuri Kalyan Ram. The movie, which is being produced on NTR Arts banner, is being directed by K.S. Ravindra (Bobby).
The film’s audio is going to be released directly into the market on September 3rd. The team planned for a major audio launch event in Hyderabad, but in view of the heavy rains and the Vinayaka Nimajjanam security issues, the decision was taken to release the audio directly into the market. This decision was taken keeping the welfare of fans in mind. A major public event will however be planned for the Trailer launch, on September 10th.
Producer Nandamuri Kalyan Ram said “I am delighted to produce my brother Tarak’s 27th film on our home banner NTR Arts. “Jai Lava Kusa” will have the very best technical standards and production values. Fans are very important to us and we decided to release the audio directly into the market keeping in view their safety. We will have a Trailer Launch event with fans on September 10th in Hyderabad”.
Raashi Khanna and Nivetha Thomas are the heroines in the movie.Devi Sri Prasad is the music director while Chota K Naidu is the cinematographer. Editing is by Kotagiri Venkateswara Rao and Thammi Raju. Art : A.S. Prakash. Visual Effects : Anil Paduri (Advitha Creative Studios)