ఉత్తమ నటుడు ఎన్‌టిఆర్ : సైమా అవార్డ్స్

సైమా అవార్డుల వేడుక అబుదాబిలో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. దక్షిణాది తారలతో అబుదాబి మెరిసిపోయింది. “జనతా గ్యారేజ్” చిత్రంలో నటించిన ఎన్‌టిఆర్‌కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. “నాన్నకు ప్రేమతో” చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ ఉత్తమ నటిగా ఎంపికైంది. జాతీయ అవార్డు గెలుచుకున్న “పెళ్లి చూపులు” ఉత్తమ చిత్రంగా నిలిచింది. “ఊపిరి” చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడి అవార్డు వంశీపైడిపల్లికి దక్కింది. సైమా వేడుకల్లో దక్షిణాదికి చెందిన పలువురు తారలు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. రెజీనా, ప్రణీత, నిక్కీ గలానీ తదితరులు అదిరేటి స్టెప్పులేశారు. అఖిల్ అక్కినేని ఇచ్చిన ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. “దువ్వాడ జగన్నాథమ్” వేషధారణలో అల్లు శిరీష్ సందడి చేసి ఆకట్టుకున్నారు.

సైమా 2017 అవార్డులు(తెలుగు)

* ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
* ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌(జనతా గ్యారేజ్‌)
* ఉత్తమ నటి: రకుల్‌ ప్రీత్‌సింగ్‌(నాన్నకు ప్రేమతో)
* ఉత్తమ నటుడు(క్రిటిక్‌): నాని
* ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (వూపిరి)
* ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లిచూపులు)
* ఉత్తమ తొలి చిత్ర నటుడు: రోషన్‌ (నిర్మలాకాన్వెంట్‌)
* ఉత్తమ తొలి చిత్ర నటి: నివేతా ధామస్‌(జెంటిల్‌మన్‌)
* ఉత్తమ సహాయనటుడు: శ్రీకాంత్‌(సరైనోడు)
* ఉత్తమ నటి: అనసూయ భరద్వాజ్‌(క్షణం)
* ఉత్తమ హాస్యనటుడు: ప్రియదర్శన్‌ (పెళ్లిచూపులు)
* ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు (నాన్నకు ప్రేమతో)
* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (జనతా గ్యారేజ్‌)
* ఉత్తమ నేపథ్య గాయకుడు: సాగర్‌ (శైలజ శైలజ: నేను శైలజ)
* ఉత్తమ నేపథ్య గాయకురాలు: రమ్య బెహర( రంగదే: అ ఆ)
* ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (ప్రణామం: జనతా గ్యారేజ్‌)
* తెలుగు చిత్ర పరిశ్రమలో 40 వసంతాలు పూర్తిచేసుకున్నందుకు స్పెషల్‌ అవార్డు: మోహన్‌బాబు
* జీవిత సాఫల్య పురస్కారం: మురళీమోహన్‌