‘పద్మావతి’ నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పద్మావతి. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ రావ‌ల్ ర‌త‌న్ సింగ్ అనే పాత్ర‌ని పోషించ‌గా, ర‌ణ‌వీర్ సింగ్ అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్ర‌లో మ‌రియు దీపిక ప‌దుకొణే చిత్తూరు యువ‌రాణి, రాణి ప‌ద్మావ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ అక్టోబ‌ర్ 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ అయిన 24 గంట‌ల‌లోనే యూట్యూబ్ రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాసిన ప‌ద్మావ‌తి చిత్ర ట్రైల‌ర్ ఇప్పుడు 50 మిలియ‌న్ క్ల‌బ్ లోకి ఎంట‌రైంది. ఈ ఆనందాన్ని షేర్ చేసుకునేందుకు బాలీవుడ్ ప్ర‌ముఖులకు దీపిక అదిరిపోయే పార్టీ ఇచ్చింది.ముంబైలోని దీపిక ఇంట్లోనే ఈ పార్టీ జరగగా.. దీనికి చిత్ర యూనిట్ తో పాటు షారుక్ ఖాన్‌, గౌరీ ఖాన్‌, క‌ర‌ణ్ జొహార్‌, ఆలియా భ‌ట్‌, సారా అలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ఆదిత్యరాయ్ క‌పూర్‌, సోనాక్షి సిన్హా, కృతి సనన్, నిర్మాత క‌పిల్ చోప్రా, ద‌ర్శ‌కుడు అభ‌య్ చోప్రా హాజరయ్యారు. 

ఇండియన్ స్క్రీన్‌పై బిగ్గెస్ట్ మూవీ అవుతుంది !

దీపికా పదుకునే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఈ భామ నటించిన ‘పద్మావతి’ మూవీ ట్రైలర్, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ చిత్రం కోసం హీరోలు రణవీర్ సింగ్, షాహిద్ కపూర్‌ల కంటే దీపికకు ఎక్కువ రెమ్యునరేషన్‌ను ఇచ్చారట.  దీపికా పదుకునే మాట్లాడుతూ… “నా రెమ్యునరేషన్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఫిల్మ్‌మేకర్స్ దానికి తగ్గట్టుగానే నాకు పారితోషికాన్ని అందజేశారు. దీనికి గర్వంగా ఫీలవుతున్నాను. ఇండియన్ స్క్రీన్‌పై ‘పద్మావతి’  బిగ్గెస్ట్ మూవీ అవుతుంది”అని చెప్పింది. అయితే ‘బాజీరావు మస్తానీ’ చిత్రంలో నేను చేసిన మస్తానీ పాత్రకంటే పద్మిని పాత్ర కోసమే ఎక్కువగా కష్టపడ్డానని ఈ బ్యూటీ చెప్పింది.

ఇటు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే…యుద్ధం చేయకుండా జాతి గౌరవాన్ని నిలబెట్టిన పద్మావతి రోల్ చేయడం నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పింది దీపిక.’సంజయ్‌ లీలా భన్సాలీతో సినిమా చేసేటప్పుడు మనం ఎన్ని టేకులు తీసుకుంటున్నామనేది లెక్కించకూడదు. జస్ట్‌ ఆయన్ని ఫాలో అవుతూ చేసుకుంటూ పోవాలి’ అని చెబుతోంది దీపికా పదుకొనె. భన్సాలీ ‘పద్మావతి’ చిత్రంలో  ట్రైలర్స్‌లో, విడుదలైన ‘ఘూమర్‌..’ పాటలో దీపికా నటన, వేషధారణ వీక్షకులను మంత్రముగ్దుల్ని చేశాయి.  ఈ సందర్భంగా భన్సాలీ గురించి, ‘పద్మావతి’ మేకింగ్‌ గురించి దీపికా మాట్లాడుతూ… ‘భన్సాలీ సార్‌తో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆయన ఎన్ని టేక్‌లు చెబుతున్నారనేది మనం పట్టించుకోకూడదు. ఆ టేక్‌ల ప్రవాహంలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ టైమ్‌లో మైండ్‌లో ఏదీ ఉంచుకోకూడదు. హేవీ కాస్ట్యూమ్స్‌ను, తలపై ఉండే భారాలన్నింటిని కాసేపు పక్కన పెట్టేయాల్సిందే. కెమెరా ముందు మనం ఏం చేయాలో దానిపైనే ఫోకస్‌ చేయాలి. అందుకు సరిపడ ఎనర్జీని తెచ్చుకోవాల్సిందే. ‘పద్మావతి’ని చాలా గట్స్‌తో చేశా. ఇదొక ఎమోషనల్‌ జర్నీ’ అని తెలిపింది.