అమ్యూజ్‌మెంట్‌ పార్క్ లాంటి సినిమా ‘పంచతంత్రం’

టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా .. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ‘పంచతంత్రం’లో బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణం. అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లలో సినిమా విడుదల కానుంది. లహరి ఆడియో ద్వారా పాటలు విడుదల కానున్నాయి. ఈ చిత్రం టీజర్ విడుదల చేసిన సందర్భంగా …

దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ…  “ఈ సినిమా ఒక అమ్యూజ్‌మెంట్‌ పార్క్ లాంటిది.  డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. ప్రతి అరగంటకు ప్రేక్షకుల్ని కొత్త రైడ్ కి తీసుకువెళతాం. నాకు అండగా నా వెనుక ఉన్నది మా నిర్మాత అఖిలేష్. మా సినిమాలో నటించిన యాక్టర్స్.. అందరూ ఫెంటాస్టిక్ పీపుల్. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి సహకరించిన టెక్నికల్ టీమ్ కి థాంక్స్. మేం అడిగిన వెంటనే టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన సత్యదేవ్ గారికి థాంక్స్” అని అన్నారు.

అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. “సినిమా గురించి చెప్పేముందు మా పార్ట్నర్ ‘ఎస్ ఒరిజినల్స్’ అధినేత సృజన్ గురించి చెప్పాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఆయన ఒకరు… అమెరికాలో డాన్ లాగా! మేం ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే… సరదాగా ఆరేడు సినిమాలు లైనప్ లో పెట్టారు. హర్ష, ప్రశాంత్, రాజ్, గ్యారీ, భువన్, నా పార్ట్నర్ ఉష, నా స్నేహితులు సునీత్, అఖిల్… వీళ్ళు లేకపోతే సినిమా కంప్లీట్ అవ్వదు. వీళ్ళందరికీ థాంక్స్. మా సినిమాలో నటించిన నటీనటులు అందరికీ చాలా ఇబ్బందులు పెట్టి, డబ్బులు కూడా కాస్త తక్కువ ఇచ్చి సినిమా చేశాం. సినిమా, రిజల్ట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. మా సహ నిర్మాత రమేష్ అంకుల్ కి థాంక్యూ” అని అన్నారు.

సహ నిర్మాత రమేష్ వీరగంధం మాట్లాడుతూ… “నాకు అవకాశం ఇచ్చిన అఖిలేష్ గారికి థాంక్యూ. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నాను” అని చెప్పారు.

రాహుల్ విజయ్ మాట్లాడుతూ… “ఒక కొత్త జీవనాధారం కోసం ‘పంచతంత్రం’ అని ఒక సినిమా చేశాం. ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. హర్ష ఈ సినిమా కథ రాసినప్పుడు… ప్రేక్షకుల వరకూ రావడం కోసం మేమంతా ఓ సాయం చేశాం. నేను చేసినది ఉడతా సాయమే” అని అన్నారు.

శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ… “‘దొరసాని’ తర్వాత తెలుగులో నా రెండో సినిమా ‘పంచతంత్రం’. మాకు హర్ష ఏదైతే కథ చెప్పారో…. అదే తీశారు. మొదటి సినిమాకు ఇంత క్లారిటీ, మెచ్యూరిటీ ఊహించలేదు. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. బ్రహ్మానందం గారు, స్వాతి గారు, సముద్రఖని గారు… ఇక్కడ వేదికపై ఉన్న సీనియర్ నటీనటులతో .. రాహుల్ విజయ్, ఇతర నటీనటుల్ని కలవడం సంతోషంగా ఉంది. ప్రశాంత్ ఆర్. విహారి  మంచి సంగీతం అందించారు ” అని అన్నారు.

సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మాట్లాడుతూ… “ఐదు భిన్నమైన కథలు.. ఐదు భిన్నమైన అనుభూతులు.. సినిమాలో ఎంతో ఉంది. సంగీత పరంగా ఎంతో స్కోప్ ఉన్న సినిమా. మంచి పాటలు ఇచ్చే ప్రయత్నం చేశా. చిన్నతనం నుంచి నేను బ్రహ్మానందంగారి భక్తుడిని. ఆయనతో పని చేసే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. అఖిలేష్ గారు, ఉష గారు, హర్ష… నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ” అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి,  పాటలు: కిట్టు విస్సాప్రగడ, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు