చెయ్యాలని ఉన్నా.. చెయ్యలేకపోతున్నా !

బాలీవుడ్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ఆమిర్ ఖాన్ నిర్వహించిన సామాజిక కార్యక్రమం ‘సత్యమేవ జయతే’ ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో తెలుగులో ఓ ప్రోగ్రామ్‌ను రూపొందించిదట ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్. సామాజిక సందేశాన్నందించే ఈ కార్యక్రమానికి పవన్‌ను వ్యాఖ్యాతగా వ్యవహరించాలని సదరు ఛానెల్ కోరిందట. అందుకు భారీ పారితోషికం ముట్టజెప్పడానికి కూడా రెడీ అయిందట. ప్రస్తుతం సినిమా నటుల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరికీ కావాల్సింది పబ్లిసిటీ. అలాంటి ప్రచారం ఓ ప్రోగ్రామ్ రూపంలో కలసి వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అయితే హీరో కమ్ పొలిటీషియన్ అయిన పవర్ స్టార్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడట
వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో టి.ఆర్.పి. టార్గెట్ చేస్తూ ఆ ఛానెల్ ప్రోగ్రామ్‌ని సెట్ చేసింది. ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమం బాగానే ఉపయోగపడుతుందని.. చేద్దామని పవన్ అనుకున్నాడు.  అయితే రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ కార్యక్రమానికి సమయాన్ని వెచ్చించలేనని చెప్పేశాడట. దీంతో మరో స్టార్ హీరోని వెతికే పనిలో పడ్డారు ఛానెల్ నిర్వహకులు.