అందాల నాయిక నాలుగు కోట్ల కి ఎదిగింది!

తెలుగులోను, అటు హిందీలోనూ క్రేజీ కథానాయికల లిస్ట్‌లో పూజా చేరిపోయింది. ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘హాస్‌ఫుల్‌ 4’ చిత్రాలతో హిట్స్‌ సాధించిన కథానాయిక పూజా హెగ్డే ‘అల.. వైకుంఠపురంలో’ చిత్రంతో మరో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెను వెల్లువలా వరిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన
ఓ చిత్రంలో నటిస్తోంది. అఖిల్‌కి జోడీగా ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలోనూ చేస్తోంది. ఇదిలా ఉంటే..బాలీవుడ్‌లో కూడా సల్మాన్‌ఖాన్‌తో నటించే లక్కీ ఛాన్స్‌ని పూజా అందిపుచ్చుకోవడం ఓ విశేషం.అక్షరాల నాలుగు కోట్ల రూపాయల్ని పారితోషికంగా తీసుకోవడం మరో విశేషం. దీంతో పూజా రెమ్యూనరేషన్‌ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, పూజా జంటగా నటిస్తున్న చిత్రానికి ‘కభీ ఈద్‌ కభీ దివాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
ఎంపిక విషయంలో రూటు మార్చింది!
గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన పూజా హెగ్డే సినిమాలు, పాత్రలు.. ఎంపిక విషయంలో రూటు మార్చింది. లేటెస్ట్‌గా ఓ మహిళా ప్రధాన చిత్రంలో నటించేందుకు పచ్చా జెండా ఊపిందట. దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఉమెన్‌ సెంట్రిక్‌ స్క్రిప్ట్‌ పూజాకి బాగా నచ్చిందట. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడి పడి లేచే మనసు’ వంటి తదితర చిత్రాలతో దర్శకుడిగా హను రాఘవపూడి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హను- పూజా కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ మహిళా ప్రధాన చిత్రంపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.
స్టార్ హీరోయిన్‌గా రాణించడం నా అదృష్టం!
పూజా హెగ్డే అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం కనబర్చని ఈ భామ గ్లామర్‌కు కొత్త అర్థం చెబుతోంది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే మాట్లాడుతూ.. తాను ఎంతో అదృష్టవంతురాలినని పేర్కొంది.
“ఒక సినిమాలో నటించేందుకు నాకు దర్శకుడు అవకాశమిస్తే… ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. ఇక నేను ఈ లోకంలోకి రాకముందే నేను చేయాల్సిన పనుల గురించి ముందే నిర్ణయించి ఉంటుందని నమ్ముతాను. వాటినే నేను చేస్తున్నాను తప్ప.. ప్రత్యేకంగా నేను ఏమీ చేయడం లేదు. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా రాణించడం నా అదృష్టంగా భావిస్తాను. ప్రస్తుతం నా జీవితం ఎంతో సంతోషకరంగా సాగుతోంది”అని పూజా హెగ్డే చెప్పింది.