అందువల్లనే ‘సాహో’ వాయిదా పడిందట !

‘బాహుబలి’ ప్రభాస్ ‘ సాహో’. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాని స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమాను ఆగష్టు 30వ తేదికి 15రోజుల పాటు వాయిదా వేసారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల ఆలస్యంతో సినిమాని వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది కానీ.. సరైన కారణాలు అయితే తెలియలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గ్రాఫిక్ వర్క్ చాలా మిగిలి ఉందని, అలాగే రీ రికార్డింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాకీ ఉందని తెలుస్తోంది.
 
ప్రభాస్ కొన్ని సీన్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని, వాటిని రీ షూట్ చేయాలని భావిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారట. విదేశాల్లోని ఓ ఎడారిలో హాలీవుడ్‌కు చెందిన టెక్నీషియన్లతో ఈ ఫైట్ సీన్ రూపొందించారని తెలిసింది. షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత రష్ చూసి దర్శకుడు సుజిత్‌ ఓకే చెప్పినప్పటికీ… ప్రభాస్ కు సంతృప్తి నివ్వలేదని సమాచారం. ఈ ఫైట్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ అంత బాగా రాకపోవడంతో ప్రభాస్ చిరాకు పడ్డాడని టాక్. సినిమాకు ప్రాణమైన క్లైమాక్స్ ఫైట్ విషయాన్ని ఏమాత్రం లైట్ తీసుకోకూడదని భావించిన ప్రభాస్ .. వాటిని మరోసారి చేయాల్సిందిగా గ్రాఫిక్స్ టీమ్‌కు చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. అందుకే సినిమా లేట్ అయ్యిందని, ఈ సీన్ సినిమాకి ప్రాణం అని అంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేశ్ ప్రతినాయకుడు పాత్రలో నటించాడు.
 
ట్రైలర్‌ ఆగస్టు 15 విడుదల
‘సాహో’ ప్రమోషన్స్‌ స్పీడ్‌ మీద ఉన్నాయి. రోజుల వ్యవధిలో కొత్త పోస్టర్స్‌ను విడుదల చేస్తూ ‘సాహో’ సందడి మొదలుపెట్టింది చిత్రబృందం. తాజాగా ‘సాహో’ చిత్రానికి సంబంధించి మరో కొత్త యాక్షన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటించారు.
 
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. గతంలో ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో ఛాప్టర్‌ 1’, ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2’లతో పాటు టీజర్‌ను కూడా ‘సాహో’ చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పంద్రాగస్టుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. జాకీష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రకాష్‌ బెల్వాది తదితరులు నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది.