సంక్షోభ సమయంలో నిరాశ్రయులకు అండగా నిలవాలి!

‘వన్‌ వరల్డ్’‌లో భాగస్వామిని కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్లోబల్‌ సిటిజన్‌, లేడీ గాగాకు నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా 127 మిలియన్‌ డాలర్లను విరాళంగా సేకరించినందుకు అభినందనలు‘…అని చెప్పింది ప్రియాంకా చోప్రా. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్డడికి విరాళాల సేకరణ కోసం ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’, ‘గ్లోబెల్‌ సిటిజన్’‌, ప్రముఖ సింగర్‌ లేడీ గాగా సంయుక్తంగా నిర్వహించిన ‘వన్‌ వరల్డ్‌ : టూగెదర్‌ ఎట్‌ హోమ్‌’ అనే వర్చ్యువల్‌ కాన్సర్ట్‌లో ప్రియాంకా చోప్రా పాల్గొంది.. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం గురించి ప్రియాంక స్పందిస్తూ…
“వన్‌ వరల్డ్‌లో భాగస్వామిని కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్లోబల్‌ సిటిజన్‌, లేడీ గాగాకు నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా 127 మిలియన్‌ డాలర్లను విరాళంగా సేకరించినందుకు అభినందనలు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి, ఇతర కార్మికులకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న మనవత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం” అని తెలిపింది.
 
ప్రియాంక ట్విట్టర్‌ ఖాతాలో తన ప్రదర్శనకు సంబంధించి కొన్ని వీడియోలను పోస్ట్‌ చేసింది. తన ప్రసంగంలో.. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభంతో నిరాశ్రయులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రియాంక ప్రస్తావించింది. కేవలం అమెరికాలోనే 17 మిలియన్ల మంది నిరాశ్రయులు ఉన్నారని, వాళ్లు పారిశుద్ధ్యం.. వైద్యం.. శుభ్రమైన నీరు వంటి కనీస వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని, చాలా క్యాంపుల్లో ఆశ్రయం లేని వాళ్లు గుంపులుగా జీవించాల్సి వస్తుందని ప్రియాంక తెలిపింది. ఈ క్రమంలో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’, ‘గ్లోబల్‌ సిటిజన్’‌ సంస్థ చొరవ తీసుకుని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వీరికి అండగా నిలుస్తున్నాయి. ఆ రెండు సంస్థలను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని ప్రియాంక పేర్కొంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిరాశ్రయులను ఒంటరిగా వదిలేయకుండా అండగా ఉండాలని ప్రియాంక కోరారు.
 
వైద్య సిబ్బందికి పదివేల షూస్‌ సాయం
గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా క‌రోనా నిర్మూల‌న కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నఅత్య‌వ‌స‌ర సేవ‌కుల కోసం 10 వేల జ‌త‌ల షూస్ ఆర్డ‌ర్ ఇచ్చారు. వాటిని హ‌ర్యానా, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల‌లోని వైద్య‌, ఆరోగ్య సిబ్బందికి సాయం చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య‌, ఆరోగ్య సిబ్బంది మా సూప‌ర్ హీరోస్‌. వారి భ‌ద్ర‌త‌ని మ‌ర‌చిపోయి ఎంతో ధైర్యంతో అసంఖ్యాకమైన ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుతున్నారు. వారికి సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు నేను పాద‌ర‌క్ష‌లు అంద‌జేస్తున్నాను అని ప్రియాంక పేర్కొంది. ‘ఇలాంటి స‌మ‌యంలో సాయం చేయాల్సిన అవ‌స‌రం ప్రతి ఒక్క‌రికి ఉంది. పేద‌లకి, నిరాశ్ర‌యులైన కుటుంబాల‌కి స‌హాయం చేసే సంస్థ‌ల‌కి విరాళాలు ఇవ్వ‌డం…వైద్యుల‌కి, పారిశుద్ద్య కార్మికుల‌కి స‌హాయం చేయ‌డం…పిల్ల‌ల‌కి ఆహారం ఇవ్వాల‌ని నేను నిక్ భావించాము. మీరు కూడా మీకు చేత‌నంత సాయం చేసి మ‌న తోటి వారికి సాయంగా‌ నిలుద్ధాం!’.. అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.