గొప్ప కథలు సినిమాలుగా నిర్మించాలి !

” ప్రతిభావంతులైన కొత్తవారికి ప్లాట్‌ఫారమ్‌ ఇచ్చి వారి కలలను నిజం చేయాలి. గొప్ప కథలు సినిమాలుగా నిర్మించాలి. ఓ నిర్మాతగా అదే లక్ష్యం” అని ‘గ్లోబల్‌ స్టార్‌’ ప్రియాంక చోప్రా పేర్కొంది. పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో ప్రియాంక నిర్మాతగా ప్రాంతీయ చిత్రాలను నిర్మిస్తోంది. ఒక పక్క హాలీవుడ్‌ చిత్రాలు, ”క్వాంటికో” అమెరికన్‌ టీవీ సిరీస్‌లో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా బాధ్యతలను చూస్తోంది. ఇప్పటికే ఐదు చిత్రాలను నిర్మించింది. గత ఏడాది మరాఠీలో చేసిన ‘వెంటిలేటర్‌’కు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వరించింది.

ఇప్పుడు ‘పహునా’ (బుల్లి సందర్శకులు) తీస్తోంది. ఇది నేపాల్‌లో మావోయిస్టుల ఆందోళనలు జరుగుతున్న సమయంలో కొందరు తల్లులు, పిల్లలు వేరైపోయి ఆ దేశం వదిలేసి మన దేశంలో సిక్కిం రాష్ట్రానికి వచ్చేశారు. అలా ఆ సమయంలో తల్లిదండ్రుల నుంచి వేరైపోయిన ఇద్దరు చిన్నారుల కథే ఈ చిత్రం. ఈ సినిమాను వచ్చే నెల ఏడో తేదీన జరగనున్న 42వ టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(టీఐఎఫ్‌ఎఫ్‌)లో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని పాఖి తైరేవాలా దర్శకత్వం వహిస్తున్నాడు.

రోమా, అయేషా, నందిత  లుక్స్‌ అంటేనే ఇష్టం !

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ స్థాయి నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగారు. సుమారు  పదిహేనేళ్ల  కెరీర్‌లో ప్రియాంక ఎన్నో రకాల పాత్రలను పోషించారు.హీరోయిన్‌గా గ్లామరస్‌ రోల్స్‌తో పాటు నాన్‌–గ్లామరస్‌ రోల్స్‌ కూడా చేశారు. ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో తనకు మాత్రం మూడు సినిమాల్లోని లుక్స్‌ అంటేనే ఇష్టం అని చెబుతున్నారు ప్రియాంక….

ఫర్హాన్‌ అక్తర్‌ డైరెక్షన్‌లో షారుక్‌ హీరోగా వచ్చిన ‘డాన్‌’ చిత్రంలోని ‘రోమా’ క్యారెక్టర్‌ లుక్, జోయా అక్తర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ ధఢ్‌కనే దో’ సినిమాలో అయేషా క్యారెక్టర్‌ లుక్, అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గుండే’ సినిమాలోని నందిత క్యారెక్టర్‌ లుక్‌. ‘‘ఈ మూడు లుక్స్‌ అంటే నాకు చాలా ఇష్టం’’ అని పేర్కొన్నారు ప్రియాంక. మేకప్‌ గురించి మాట్లాడుతూ – ‘‘క్యారెక్టర్‌ కోసం సెట్‌లో ఉన్నప్పుడు హెవీ మేకప్‌ వేసుకుంటా. విడిగా మాత్రం సింపుల్‌ మేకప్‌నే ఇష్టపడతా. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులే వేసుకుంటా. అలా లేనప్పుడు ఏ బ్రాండ్‌ అయినా పట్టించుకోను’’ అని ప్రియాంక స్పష్టం చేశారు