అలా చేస్తే ఇక మాకు భవిష్యత్‌ ఉంటుందా?

రాధికా ఆప్తే… బాలకృష్ణతో రెండు సినిమాలలో నటించిన రాధికా ఆప్టే, రజినీకాంత్ ‘కబాలి’ సినిమాలో మెయిన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.  ఈ అమ్మడికి ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే ఈ సినిమాలలో నటించడం వల్ల ఆమెకు వచ్చిన పేరు కంటే కూడా ఆమె చేసిన వివాదాస్పదమైన కామెంట్స్‌తోనే ఎక్కువ పాపులర్ అయిందనే విషయం తెలిసిందే, అయితే  పాపులారిటీ కోసం చేసిందో,  లేక నిజంగానే లైంగిక వేధింపులను ఎదుర్కొందో తెలియదు కానీ, టాలీవుడ్‌పై మాత్రం ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది . ‘టాలీవుడ్‌లోని హీరో, నిర్మాత పడకగది రమ్మని పిలిచారని, టాలీవుడ్ హీరోయిన్‌లపై లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయ’ని …అప్పట్లో ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తాజాగా  ఇటువంటి కామెంట్సే చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. కేవలం ఆడవారిపైనే కాదు.. మగవారు, చిన్నారులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని తాజాగా ఆమె చేసిన కామెంట్స్‌తో మరోసారి దుమారం చెలరేగుతోంది…
‘‘లైంగిక వేధింపులు ఒక్క సినిమారంగంలోనే కాదు ప్రతి రంగంలోనూ ఉన్నాయి. రోజూ ఇలాంటి వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి. ఇది ఒక్క మహిళలపైనే కాదు పురుషులు, చిన్న పిల్లలపై కూడా ఈ వేధింపులు జరుగుతున్నాయి. ఈ సమస్య కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. కామంతో కొవ్వెక్కిన అధికారులు ఇలాంటి వాటిలో ముందున్నారు. వీటిని ఫేస్ చేసిన బాధితురాలో, బాధితుడో ఖండిస్తే ఈ సమస్య పోదు. అందరూ కలిసి పోరాడితేనే ఈ సమస్యను ఎదుర్కొగలం. కాస్టింగ్‌ కౌచ్ సమస్య ఉందని చెబుతుంటే….’ఇంత ధైర్యంగా చెబుతున్న మీరు, మిమ్మల్ని టార్చర్ చేసిన వారి పేరు చెప్పవచ్చు కదా!’ అంటూ కొందరు అడుగుతున్నారు. అలా బయటపెడితే ఇంక మాకు భవిష్యత్‌ ఉంటుందా? మమ్మల్ని ఈ ప్రపంచంలో బ్రతకనిస్తారా?’’ అంటూ రాధిక ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.