మూడు ‘ఎఫ్‌’లకు అమిత ప్రాధాన్యమిస్తుంటా!

రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ఆమె ఈ కరోనా కాలంలో ముంబైలో సోషల్‌సర్వీస్‌ చేస్తూ తమలోని సేవాగుణాన్ని చాటుకుంది. తాజాగా … ఇండియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయ్‌లోని ధారవి లో రకుల్‌ పర్యటించబోతున్నారు. ఇటీవల కరోనా విజృంభణ చేసిన ఈ మురికివాడ లోని ప్రజలకు ఆహార పంపిణీ తో పాటు.. వారి ఆహారపు అలవాట్లు , కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ.. వాళ్లలో చైతన్యం నింపబోతోంది. ఈ కరోనా సమయంలో అందునా కరోనా విజృంభిస్తున ధారవిలో రకుల్‌ ఇలాంటి ఓ కార్యక్రమం చేయాలని అనుకోవడం ఆమెలోని ధైర్యానికి, సేవా గుణానికి నిదర్శనం అంటున్నారు.
 

ప్రకృతి కంటే గొప్పవాళ్లం కాదు!
లాక్‌డౌన్‌లో నాలో ఎటువంటి ఆందోళన, భయాలు లేవు. ఎందుకంటే – మనకు అర్థం కావాల్సింది.. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఈ అనంత విశ్వంలో కేవలం మానవ మాత్రులమే అన్నది గుర్తెరగాలి. ఈ కరోనా సంక్షోభం నేర్పే పాఠం అదే. ప్రకృతి కంటే మనం ఏమాత్రం గొప్పవాళ్లం కాదు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిబ్బరం కోల్పోకూడదు. రేపటి నమ్మకంతో జీవించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న సమాజానికి, పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలు చేయాలి.
 
‘‘కాలం మారుతోంది. భూముల ధరలు పెరుగుతున్నాయి. జనాభా అంతకంతకు రెట్టింపు అవుతోంది. విశ్వంలో జాగా వెతక్క తప్పదు. ఇక, కొత్త టెక్నాలజీనే మనల్ని కాపాడుతుంది. విశ్వగ్రహాలలో అడుగుపెట్టడం ఇప్పుడు అవసరం. మన భవిష్యత్తు సమస్యలకు అదొక పరిష్కారం..’’
మనస్ఫూర్తిగా ఇష్టపడాలి!
“ప్రేమనేది ఎంతో అందమైన భావన. ప్రేమ, పెళ్లి బంధాలు జీవితానికి పరిపూర్ణత చేకూర్చుతాయని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. వీటిపై తనకు పూర్తి నమ్మకమున్నదని చెబుతోంది.ఇటీవల ఓ చాట్‌ షోలో పాల్గొన్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రేమ పట్ల తన అభిప్రాయాల్ని వెల్లడిస్తూ.. ‘తల్లిదండ్రుల వల్లే నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకోగలిగా. ప్రేమనేది ఎంతో అందమైన భావన. దాని గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేము. కానీ కొంతమంది మాత్రం ప్రణయ, పరిణయ బంధాలను భారంగా భావిస్తుంటారు. అలా ఎందుకు అపోహపడతారో తెలియదు. ఎవరినైనా ప్రేమిస్తే నిజాయితీతో మనస్ఫూర్తిగా వారిని ఇష్టపడాలి. అదే నిజమైన లవ్‌గా నేను నిర్వచిస్తా. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను అందించే మనస్తత్వం నాది. ప్రేమతో పాటు వివాహ వ్యవస్థ పట్ల నాకు గౌరవముంది’ అని చెప్పింది..
 
తనకు కాబోయే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు చెబుతూ ‘ నాకన్నా చాలా ఎత్తు ఉండాలి. హైహీల్స్‌ వేసుకున్నా నేను తలెత్తి చూడగలిగేంతా హైట్‌ ఉండాలి. అందం, డబ్బు కంటే ముఖ్యంగా తెలివితేటలుండాలి. జీవితం పట్ల స్పష్టత, ఉన్నతమైన లక్ష్యాల్ని కలిగి వాటి సాధనకై కృషిచేస్తూండాలి’ అని చెప్పింది. ‘ఫిల్మ్స్‌.. ఫిట్‌నెస్‌..ఫుడ్’‌… ఈ మూడు ‘ఎఫ్‌’లకు జీవితంలో అమిత ప్రాధాన్యమిస్తుంటానని తెలిపింది రకుల్‌ప్రీత్‌సింగ్‌.