‘రామ రావణ రాజ్యం’ ఫస్ట్ లుక్ విడుదల

వినయ్ పరువెళ్ల , జ్యోతి హీరోహీరోయిన్లుగా వి3 ఫిలిమ్స్ పతాకం పై రామ్ వికాస్. వి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “రామ రావణ రాజ్యం”. ఈచిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వికాస్ మాట్లాడుతూ… ‘ పూర్తి యాక్షన్ చిత్రమిది. పాత, కొత్త ఆర్టిస్టుల కలయికతో ఈ చిత్రం తెర కెక్కనుంది. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్నాం.”అన్నారు.
ఈ చిత్రానికి డి.ఓ.పి:రూషేంద్ర,ఎడిటర్:సాయి,పి.ఆర్.ఓ :బి.వీరబాబు,మ్యూజిక్:కనిష్క,కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం:రామ్ వికాస్. వి.