రవీంద్ర గోపాల `దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌` ఆడియో విడుదల !

అన్న‌ల రాజ్యం, నాగ‌మ‌నాయుడు, రాఘ‌వేంద్ర మ‌హ‌త్యం లాంటి చిత్రాల‌ను నిర్మించిన నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ.. చిత్రాన్ని నిర్మించారు. దేశంకోసం ప్రాణాల‌ర్పించిన స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం`దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌`.రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ ఆవిష్క‌రణ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, దామోద‌ర్ ప్ర‌సాద్, ప్ర‌స‌న్న కుమార్, మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల. బాబ్జీ,  ప్ర‌మోద్ శ‌ర్మ‌, బ‌ల్లెపల్లి మోహ‌న్‌, ఘంటాడి కృష్ణ, ద‌ర్శ‌కుడు ,న‌టుడు, నిర్మాత  ర‌వీంద్ర గోపాల త‌దిత‌రులు పాల్గొన్నారు.
ప‌రుచూరి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ…“ సాహ‌సం చేసి  రవీంద్ర గోపాల్ `దేశం కోసం భ‌గ‌త్ సింగ్ ` సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల పాత్ర‌లు వేశాడు. త‌న మీద త‌న‌కు ఎంతో న‌మ్మ‌కం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు.  త‌న‌కోసం కాదు.. ఇది దేశంకోసం చేసిన సినిమా. స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల గొప్పత‌నాన్ని ప్ర‌పంచానికి  తెల‌పాల‌న్న  త‌పన‌తో ఈ సినిమా చేశాడు. ఈ విష‌యంలో ర‌వీంద్ర‌ని అభినందిస్తున్నాను.  ఇటీవ‌ల సినిమా చూశాను. ప్ర‌తి పాత్ర‌కు న్యాయం చేశాడు.  ఇందులో పాట‌లు కూడా అద్భుతంగా ఉన్నాయి.  ఈ సినిమా విజ‌యం సాధించి మ‌రెన్నో మంచి చిత్రాలు చేసే ప్రోత్సాహాన్ని ప్రేక్ష‌కులు క‌ల్పించాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ…“ `దేశంకోసం భ‌గ‌త్ సింగ్ ` సినిమా  ప్యాష‌న్ తో  చేశారు.  డ‌బ్బు కోస‌మే సినిమా తీసే  ఈ కాలంలో దేశం కోసం సినిమా చేయ‌డం అభినందిద‌గ్గ విష‌యం. దేశ‌భ‌క్తితో ఈ సినిమా తీసిన ర‌వీంద్ర గారిని అభినందిస్తూ ..ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ సాధించి ఇలాంటి మంచి సినిమాలు మ‌రెన్నో నిర్మించాల‌ని కోరుకుంటున్నా“అన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు బ‌సిరెడ్డి మాట్లాడుతూ…“సినిమా చూశాక ర‌వీంద్ర గోపాల్ ప‌డ్డ క‌ష్టం క‌నిపించింది. పాట‌లు అద్భుతంగా ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ చూడాల్సిన గొప్ప దేశ‌భ‌క్తి చిత్ర‌మిది“ అన్నారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్ర‌ట‌రి ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ…“ ర‌వీంద్ర గోపాల్ కు డిస్ట్రిబ్యూట‌ర్ గా, ఎగ్జిబిట‌ర్ గా, ప్రొడ్యూస‌ర్ గా సినిమా రంగంలో ఎంతో అనుభ‌వం ఉంది. క‌మ‌ర్షియ‌ల్  సినిమాల కాలంలో దేశం కోసం సినిమా చేసిన ర‌వీంద్ర గోపాల్ ని అభినందించి, ఈ సినిమాను ఆద‌రించాల్సిన అవస‌రం మ‌నంద‌రి పైన ఉంది. ప్ర‌తి పాట‌లో దేశ‌భ‌క్తి ఉట్టిప‌డుతోంది. ఈ సినిమా స‌క్సెస్ సాధించి ర‌వీంద్ర ఇలాంటి మ‌రెన్నో మంచి చిత్రాలు చేయాల‌న్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, న‌టుడు ర‌వీంద్ర గోపాల్ మాట్లాడుతూ…“ఒక మంచి సినిమా చేయాల‌న్న క‌సితో చేసిన సినిమా ఇది.  ఇటీవ‌ల మా  చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌రించి.. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గారికి ధ‌న్య‌వాదాలు. సినిమాను ఫిబ్రవరి 3న విడుద‌ల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం  అన్నారు.
ఈ చిత్రానికి  కెమెరాః సి. వి. ఆనంద్, సంగీతంః ప్ర‌మోద్ కుమార్‌, మాట‌లుః సూర్యప్ర‌కాష్,రవీంద్ర గోపాల, పాట‌లుః ర‌వీంద్ర గోపాల‌