ఆ సీన్లు చరణ్‌కు నచ్చలేదట …రీషూట్ !

‘రంగస్థలం’తో భారీ విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు.ఈ  సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. మొదటి, రెండు షెడ్యూళ్లకు చరణ్ హాజరుకాలేదు. మూడో షెడ్యూల్ నుంచి అతను షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఓ యాక్షన్ సీన్‌తో పాటు కొన్ని కాంబినేషన్ సీన్లు మాత్రమే తీశారు. అవి కూడా ఇప్పుడు మళ్లీ రీ షూట్ చేయబోతున్నట్లు సమాచారం.

తను నటించిన సీన్లు చరణ్‌కు నచ్చలేదట. అందుకే రీషూట్ చేయమని దర్శకుడు బోయపాటిని అతను కోరాడట. ఇటీవల జరిగిన  షెడ్యూల్‌లో రామ్‌చరణ్, ప్రశాంత్, స్నేహ, కైరా అద్వాని కాంబినేషన్‌లో కొన్ని సీన్లు తీశారు. వీటిలో కొన్నింటిని త్వరలో రీషూట్ చేయబోతున్నారు. ప్రశాంత్, స్నేహ కాల్షీట్లు చూసుకొని ఈ సన్నివేశాలను మళ్లీ ప్లాన్ చేస్తారు. ఈనెల 12న బ్యాంకాక్ వెళ్లనుంది సినిమా యూనిట్. అక్కడ 15  రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రీషూట్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేశారు.

రామ్‌చరణ్‌ని సరికొత్త యాంగిల్‌లో …

ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ, ‘మాస్‌ ఇమేజ్‌ ఉన్న రామ్‌చరణ్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే ఆడియెన్స్‌లో ఎన్ని అంచనాలుంటాయో అందరికి తెలిసిందే. ఈ అంచనాలకు దీటుగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మెగా అభిమానులు, ప్రేక్షకులను అలరించేలా రామ్‌చరణ్‌ని సరికొత్త యాంగిల్‌లో దర్శకుడు బోయపాటి ప్రజెంట్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. అందులో భాగంగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఫ్యామిలీ సన్నివేశాలను, అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్‌ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. అంతకు ముందు షూట్‌ చేసిన 15 రోజుల షెడ్యూల్‌లో వివేక్‌ ఒబెరాయ్ సహా ప్రధాన తారాగణం పాల్గొంది. తదుపరి షెడ్యూల్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్తున్నాం. మే 12 నుంచి 15 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుంది’ అని అన్నారు.