నన్ను నేను అర్థం చేసుకోవలసింది చాలా ఉంది !

ప్రేమ వ్యవహారాల గురించి బాహాటంగా స్పందించడానికి మన కథానాయికలు సంశయిస్తారు. ఒకవేళ ప్రేమలోవున్నప్పటికి అలాంటిదేమి లేదంటూ సమాధానాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తారు. అయితే చెన్నై సోయగం రెజీనా మాత్రం అందుకు భిన్నంగా తన లవ్‌ఎఫైర్‌పై ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ఒకప్పుడు తాను ప్రేమలో వున్నానని…అనుకోని కారణాల వల్ల ఆ బంధం విచ్ఛిన్నమైందని చెప్పింది. అయితే ప్రియుడి పేరును చెప్పడానికి మాత్రం నిరాకరించింది. కోలీవుడ్, టాలీవుడ్‌ లో పాపులర్ హీరోయిన్‌ రెజీనా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి….

నేనొకరిని ప్రేమించాను ఆ కారణంగానే.. ఒంటరిగా ఉన్నా నంటోంది రెజీనా. రెజీనా . రెజీనా తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చింది…. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్‌ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించింది ఇది.అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ నేను తొందర పడడం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడడానికి కారణం ఏమిటి, ఏమిటా అనుభవం? అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది.ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను. నేనిప్పుడిలా మాట్లాడడానికి అదే కారణం. అయినా ఆ విషయాల్లోకి వెళ్లదలుచుకోలేదు.
ప్రస్తుతం నేను చాలా తెలివిగా ఉన్నాను. నటిగా చిన్న గ్యాప్‌ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమైనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది. అందుకే ఇంకా కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నా. ముఖ్యంగా కోలీవుడ్‌లో ‘మానగరం’, ‘రాజతందిరం’, ‘సరవణన్‌ ఇరుక్క భయమేన్’, ‘జెమినీగణేశనుమ్‌ సురళీరాజవుమ్‌’ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఎస్‌జే.సూర్యతో నటించిన ‘నెంజమ్‌ మరప్పదిల్‌లై’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘హరేరామ హరే కృష్ణ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది.