‘రౌద్ర‌రూపాయ న‌మ:’ లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్ !

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోన్న`రౌద్ర రూపాయ న‌మః` చిత్రం నుండి సెకండ్ లిరిక‌ల్ వీడియో సాంగ్ ప్ర‌ముఖ న‌టుడు సాయికుమార్ లాంచ్ చేశారు.`బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో రావుల ర‌మేష్ క్రియేష‌న్స్ పతాకంపై పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో రావుల ర‌మేష్ నిర్మిస్తోన్న చిత్రం `రౌద్ర రూపాయ న‌మః`. `త‌ళుకు త‌ళుకుమ‌ను తారా..కులుకులొలుకు సితారా `అంటూ సాగే ఈ పాట‌ను సురేష్ గంగుల రచన. జాన్ భూష‌ణ్  సంగీతం.
సాయి కుమార్ మాట్లాడుతూ…“రౌద్ర‌రూపాయన‌మః` టైటిల్ చాలా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌. ఈ చిత్రంలోని రెండు పాట‌ల‌ను చూశాను. చాలా బాగా తీశారు.  కొరియోగ్రాఫ‌ర్, డైర‌క్ట‌ర్ , రైట‌ర్ ఇలా పాలిక్ ఆల్ రౌండ‌ర్ అని చెప్పొచ్చు.  అంత‌ర్జాతీయ గుర్తింపు ఉన్న బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించిన ఈ  సినిమా స‌క్సెస్ సాధించి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా“అన్నారు.
నిర్మాత రావుల ర‌మేష్ మాట్లాడుతూ..“సాయి కుమార్ గారి చేతుల మీదుగా మా సినిమాలోని రెండో పాట లాంచ్ కావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సాంగ్ ని కూడా పెద్ద హిట్‌ చేస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
ద‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ…“ సాయి కుమార్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.  ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో వ‌స్తోన్న మా సినిమాలోని పాట‌ల‌ను ఒక ప‌వ‌ర్ ఫుల్ యాక్ట‌ర్ తో లాంచ్ చేయాల‌ని సాయికుమార్ గారితో మా చిత్రంలోని సెకండ్ లిరిక‌ల్ వీడియో లాంచ్ చేసాం.  సురేష్ గంగుల రాసిన అద్భుత‌మైన లిరిక్స్ కు అంతే విధంగా జాన్ భూష‌న్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. సినిమా చాలా బాగొచ్చింది. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ గారు మా సినిమాకు ఆయువు పట్టు. త్వ‌ర‌లో మా చిత్రం టీజ‌ర్ లాంచ్ చేయ‌నున్నాం“ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ తోటపల్లి సాయినాథ్,చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ర‌ఘు, వెంక‌ట్, మోహ‌న సిద్దిఖి, పాయ‌ల్ రాజ్పుత్, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్    ముఖ్య పాత్ర‌ల్లో  న‌టిస్తోన్న ఈ చిత్రానికి  డిఓపీః గిరి-వెంక‌ట్; స్టంట్స్ః ర‌న్ ర‌వి; ఎడిట‌ర్ః రామ‌కృష్ణ అర్ర‌మ్‌; ఆర్ట్ః సురేష్ భీమ‌గాని; లిరికల్ వీడియో: నిశాంత్