నా పరిమితులు దాటి బయటకు రాను !

ప్రేక్షకులు హీరోయిన్ల అందాల ప్రదర్శన చూడడానికే  థియేటర్లకు వస్తారని అనుకోను. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది.  సినిమాలో ఏ పాత్ర బాగా చేయకపోయినా ఆ సినిమానూ, అందులో నటించిన వారిని  ఆదరించడం లేదు. ఎంత పెద్ద హీరోయిన్‌ అయినా, హీరో అయినా సినిమా బాగా లేకపోతే నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్‌ చేస్తున్నారు. నాకు నేనే కొన్ని పరిమితులు విధించుకున్నాను. వాటిని దాటి సినిమాలు చేయడం నా వల్ల కాదు. ఈ పరిమితులు కారణంగానే కొన్ని సినిమాలను వదులుకున్నాను. వాటికి నేనేమీ బాధపడడం లేదు. నా సినిమాలను నా కుటుంబంతో కలిసి చూడాలి. తెర మీద ఏమాత్రం అసభ్యంగా కనిపించినా మా వాళ్ళ ముఖం నేను చూడలేను…. అని అంటోంది ‘సాహసం శ్వాసగా సాగిపో’ నాయిక మంజిమా మోహన్

సీరియస్‌ సన్నివేశాల కన్నా రొమాన్స్‌ సన్నివేశాలు చేయడం కష్టం అనిపిస్తుంది. అలాంటి సినిమాలకు గానీ, సన్నివేశాలకు గానీ నేను మొదటి నుంచీ దూరంగానే ఉంటున్నాను. అవి చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్లామర్‌కీ, అందాల ఆరబోతకి మధ్య సన్నని గీత ఉంది. ప్రతి ఒక్కరూ అది తెలుసుకుంటే మంచిది. ‘గ్లామర్‌ పేరుతో అందాల ప్రదర్శన చేయలేను’ అని చెబుతున్నాను తప్ప గ్లామర్‌కి వ్యతిరేకం అనడం లేదు.

ఆ మధ్య లిప్‌లాక్‌లకు అభ్యంతరం లేదు అన్నారని వార్తలు వచ్చాయి నిజమేనా? అని అడిగితే …..నేను ఎప్పుడూ అలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వను. మితిమీరిన గ్లామర్‌గా కనిపించడానికే ఒప్పుకోను. లిప్‌లాక్‌లకి ఎలా అంగీకరిస్తాను‌? ఈ విషయంలో నేను చెప్పింది ఒకటి. బయటకు వచ్చింది ఒకటి. అలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరమే! అవకాశాలు రావన్న బాధ నాకు లేదు. సినిమాలు లేకపోతే ఇంట్లో కూర్చుంటాను. అంతే తప్ప నా పరిమితులు దాటి బయటకు రాను.