ప్రేమ వ్యవహారాన్ని ఖండించలేదట !

‘ ప్రేమమ్‌’ చిత్రంతో మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఆ చిత్రంలో మలర్‌ టీచర్‌గా నటించి విశేషం గుర్తింపును పొందింది.  ఆ తరువాత టాలీవుడ్‌కు ‘ఫిదా’ చిత్రంతో రంగప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇక తమిళ సినీ రంగానికి ‘కరు’ చిత్రం ద్వారా అడుగుపెట్టింది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న ఈ చిత్రం విడుదల కాకముందే ధనుష్‌తో ‘మారి-2’ చిత్రంలో రొమాన్స్‌కు రెడీ అవుతోంది.అదృష్టం అంటే ఆమెదేనని చెప్పొచ్చు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో ‘కరు’ చిత్రం తెచ్చిపెట్టే పేరు కోసం ఎదురు చూస్తున్న సాయిపల్లవిని చాలామంది మలయాళీ అమ్మాయి అంటున్నారట. అంతేకాదు, ఈ అమ్మడు ఒక కోలీవుడ్‌ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతోందని చెవులు కొరుక్కుంటున్నారట. అయితే ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా తనను ‘మలయాళీ అమ్మాయి’ అని అనకండని, తాను కోయంబత్తూర్‌లో పుట్టిన పక్కా ‘తమిళ అమ్మాయి’నని అంటోంది. మొత్తం మీద తన ప్రేమ, ప్రియుడు అన్న విషయాలను ఖండించలేదంటే ఈమెకో లవర్‌ ఉన్నాడన్న విషయం కొట్టిపారేయలేం అంటున్నాయి కోడంబాకం వర్గాలు. ఇక అతగాడెవరన్నది తెలియాల్సి ఉందని పేర్కొంటున్నాయి.