నేను తీసుకునే ప్రతి నిర్ణయం గొప్పదిగానే భావిస్తా !

సమంత ఇటీవల చేసిన చిత్రం ‘రంగస్థలం’. రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. మేకప్‌ లేకుండా చేసిన ఈ పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నారు.  తన భర్త నాగచైతన్యతో విహార యాత్ర నిమిత్తం వెళ్లిన ఆమె అమెరికాలో ఉంది.ఈ సందర్భం గా  అభిమానులతో సమంత ట్విట్టర్ లో చిట్‌చాట్‌ చేసింది. ఇటీవల తనను నటనతో ఇంప్రెస్‌ చేసిన నటి సాయి పల్లవి అని సమంత ప్రశంసించడం విశేషం… 

‘రంగస్థలం’ విజయంతో మీరు ఎంత సంతోషంగా ఉన్నారు?
నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతీ పాత్ర ప్రత్యేకమే. ఈ ప్రయాణం ఫలితాల మీద ఆధారపడదు.
‘రంగస్థలం’ సినిమాకు మీకు వచ్చిన ఉత్తమ ప్రశంస ఏది?
సినిమా విడుదలైన రోజు నుంచీ ట్వీట్లు ఆగడం లేదు. అది బెస్ట్‌ ఫీలింగ్‌. ప్రతి కొన్ని సెకన్లకు నా ట్విటర్‌లో మెసేజ్ లు రిఫ్రెష్‌ చేస్తున్నా ట్వీట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.
రామ్‌ చరణ్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
ది బెస్ట్‌. ఆయన చాలా ప్రియమైన, సౌమ్యమైన వ్యక్తి.
‘అదృష్టవంతులు. అందుకే పెద్ద అవకాశాలు వస్తున్నాయి’ అని ప్రజలు అంటే మీ స్పందన ఏంటి?
అదృష్టం కాస్త కావాలి. కానీ అలా అన్నింట్లో ఎన్ని రోజులు కేవలం అదృష్టంతోనే ముందుకు వెళ్తారు?
అక్కినేని చైతన్యలో మీకు బాగా నచ్చిన విషయం?
చై అక్కినేని కావడం.
ఎందుకు ‘రంగస్థలం’ థ్యాంక్స్‌ మీట్‌కు రాలేదు?
విహారయాత్రలో ఉన్నా.
మీ విహారయాత్ర ఎలా జరుగుతోంది?
ఈ విరామం చాలా అవసరం.
మీరు జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటి?
నేను తీసుకునే ప్రతి నిర్ణయం గొప్పదిగానే భావిస్తా.
మీ జీవితంలో గుర్తుండిపోయే రోజు ఏమిటి?
నా వివాహం రోజు.
ఉపాసన, రామ్‌ చరణ్‌ గురించి ఒక పదంలో చెప్పండి?
సరైన జోడి.
తన పెర్ఫార్మెన్స్‌తో ఇటీవల మిమ్మల్ని ఇంప్రెస్‌ చేసిన నటి లేదా నటుడు ఎవరు?
సాయి పల్లవి.

వంద కోట్లు కొల్లగొట్టిన చిత్రాల నటిగా అరుదైన రికార్డు
దక్షిణాదిన కథానాయికగా అగ్ర స్థానాన కొనసాగుతోన్న సమంత.. ఇప్పుడో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఎక్కువ మిలియన్ డాలర్స్ వసూలు చేసిన చిత్రాల్లో నటించిన హీరోయిన్‌గా క్రెడిట్ సొంతం చేసుకున్న సామ్.. ఇప్పుడు దక్షిణాదిన.. ఎక్కువ వంద కోట్లు కొల్లగొట్టిన చిత్రాల్లో నటించిన రికార్డును కూడా కైవసం చేసుకుంది. సమంత నటించిన తెలుగు చిత్రాలు ‘జనతా గ్యారేజ్’, ‘అత్తారింటికి దారేది’తో పాటు.. తమిళ సినిమాలు ‘మెర్సల్’, ‘తేరి’, ‘కత్తి’ వంద కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకూ వంద కోట్ల సినిమాలు ఐదింటిలో నటించిన సమంత.. తాజాగా ‘రంగస్థలం’తో మరో హండ్రెడ్ క్రోర్స్ మూవీని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇప్పటివరకూ వంద కోట్లు చూసిన ఆరు చిత్రాల్లో నటించిన కథానాయికగా సమంత సరికొత్త రికార్డును నెలకొల్పిందన్నమాట.
 ప్రస్తుతం ‘రంగస్థలం’తో ఆడియెన్స్ అలరిస్తోన్న సమంత.. ఇప్పుడు ఐదు సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో సావిత్రి బయోపిక్ ‘మహానటి’, విశాల్ ‘అభిమన్యుడు’, విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’ చిత్రాలు విడుదలకు ముస్తాబయ్యాయి. ఇక.. శివ కార్తికేయన్‌తో నటిస్తున్న ‘సీమరాజా’, బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ‘యు-టర్న్’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇలా.. ఆప్టర్ మ్యారేజ్ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది క్యూట్ బ్యూటీ సమంత. మరి.. సామ్ నటిస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలి.