‘విశాఖ ఉత్సవ్‌’లో ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ప్రోమో విడుదల

డిసెంబర్ 28న జరిగిన విశాఖ ఉత్సవ్‌ లో మంత్రి అవంతి శ్రీనివాస్ చేతులమీదుగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి డాన్స్ చేయడం ప్రేక్షకాభిమానుల్ని అలరించింది. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల కోరికపై ‘డాంగ్ డాంగ్’ పాటకు డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.
 
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ” అనిల్ రావిపూడి నుండి నెవర్ సీన్‌ బిఫోర్ మూవీ. అలాగే మహేష్ బాబు గారి కెరీర్లో ‘వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరబుల్ మూవీ’. జనవరి 11న సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కాబోతుంది. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరి మనసులను దోచుకోబోతున్నారు మహేష్ బాబు. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి దాని కంటే ఎక్కువే ఉంటుంది” అన్నారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ” `ఎఫ్2` సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి వచ్చి సక్సెస్ అయ్యాం. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవ్ కి వచ్చి ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ప్రోమో లాంచ్ చేశాం. ఈ పాటలో మీరు చూసిన డాన్స్ కొంచమే, ‘మైండ్ బ్లాక్’ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు డాన్స్ ఇంకా ఇరగదీశారు. మహేష్ బాబు గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. ఆయనతో చేసిన ఈ జర్నీ మరిచిపోలేనిది. ఆయన హీరోగానే కాదు వ్యక్తిగతంగా కూడా సూపర్ స్టార్. రాజేంద్ర ప్రసాద్ చాలా ముఖ్యమైన పాత్ర చేశారు, మహేష్ బాబు- రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అలాగే 13 ఏళ్ల తరువాత విజయశాంతి గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ తో `ఎఫ్2` కన్నాఎక్కువ ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
 
‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు` ప్రతి పాటను ఒక చార్ట్ బస్టర్ గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 2020 వెల్కమ్ చేస్తూ ‘డాంగ్ డాంగ్’ పాట ప్రోమో ని లాంచ్ చేశాం. ఈ సినిమాలో మహేష్ గారిని కొత్త కోణంలో చూడబోతున్నారు. ముఖ్యంగా భీభత్సమైన డాన్స్ మూమెంట్స్ తో చూడబోతున్నారు, అనిల్ రావిపూడి అదరగొట్టాడు. ” అన్నారు.
 
ఈ చిత్రానికి రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ ఇతర సాంకేతిక వర్గం.