త్వ‌ర‌లో విడుద‌ల‌ శ‌ర్వానంద్‌, శ్రీ కార్తిక్‌ `ఒకే ఒక జీవితం`

శ‌ర్వానంద్ కెరీర్‌లో రూపొందుతోన్న 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తిక్  ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా  రూపొందుతున్న‌ ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో శ‌ర్వానంద్‌కు మంచి  ఫాలోయింగ్ ఉంది. సైన్స్ ఫిక్ష‌న్  ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇప్ప‌టికే `ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది`. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రోజు ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది  పాత్ర‌కి సంభందించి ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల చేసారు. ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా  ఉంది. ఇప్ప‌టికే `ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది`. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

శ‌ర్వానంద్ స‌ర‌స‌న మ‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా `డియ‌ర్ కామ్రెడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు.