వ్యాంకిష్ మీడియా పతాకంపై, షేక్ గౌస్ చిత్రం ప్రారంభం

వ్యాంకిష్ మీడియా పతాకంపై, ఆయుష్, వర్ణిక హీరో హీరోయిన్లుగా,రవి కుమార్ పొన్నగంటి దర్శకత్వంలో, షేక్ గౌస్ నిర్మిస్తున్న నూతన చిత్రం గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎం.ఎల్.ఎ  క్లాప్ నివ్వగా, వై.టి.నాయుడు [ఎడిషనల్ ఎస్.పి. గుంటూరు అర్బన్]  ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.నిర్మాత షేక్ గౌస్ కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చిత్ర నిర్మాత షేక్ గౌస్ మాట్లాడుతూ…ఈ రొజు నుంచి నాన్ స్టాప్ గా మార్చ్ 24 వరకు షూటింగ్ జరిపి, సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణను పూర్తి చేస్తాము.పాటలను కలకత్తా, వైజాగ్, బ్యాంకాక్ లో చిత్రికరించడానికి సన్నాహాలు చేస్తున్నాము. సినిమాను ఏప్రిల్ చివరి వారంలో లేదా మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తాము అన్నారు
సంగీత దర్శకుడు: అమ్మపండు, కెమెరా : దుర్గ ప్రసాద్