శివ`22`మూవీతో పెద్ద హిట్ కొడ‌తాడు!

రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా చేస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ’22’ షూటింగ్‌ పూర్తి చేసుకుని.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌, మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ ’22’ రూపొందుతోంది.
పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ – ”శివ నాతో కలిసి చాలా సినిమాలకు వర్క్‌ చేశాడు. ఇప్పుడే ’22’ మూవీ చూశాను. చాలా బాగుంది. బేసిగ్గా శివ మీద నాకు నమ్మకం ఉంది. చాలా టాలెంటెడ్‌. పెద్ద డైరెక్టర్‌ కావాలి. పెద్ద హిట్‌ కొట్టాలి. అలాగే హీరో రూపేష్‌ కుమార్‌కి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
 
నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – శివ‌ 35 రోజుల్లో టాకీ పూర్తి చేశాడు. ఎంత ప్రీ ప్రొడక్షన్‌ చేసుకొని, ఎంతో ప్లానింగ్‌, కాన్ఫిడెన్స్‌ ఉంటేనే అంత తొందరగా షూటింగ్‌ పూర్తి చేయగలడు. టీమ్‌ అందరికీ మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
 
బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”టెంపర్‌’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు పూరిగారు ‘మీ శివ తొందరగా డైరెక్టర్‌ అయిపోతాడు అని’ చెప్పారు. ఒక ఫాదర్‌గా చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సడెన్‌గా ఒకరోజు రూపేష్‌కుమార్‌గారిని తీసుకొచ్చి సినిమా స్టార్ట్‌ చేస్తున్నాం. తనే హీరో, ప్రొడ్యూసర్‌. నెక్స్‌ట్‌ వీక్ సినిమా ఓపెనింగ్‌ అని చెప్పాడు. సినిమా చూశాక కూడా అందరూ చాలా బాగుందని అంటున్నారు. నా పుట్టినరోజు నాడు ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అవడం చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి శివ దర్శకుడు అయితే, మా అన్నయ్యగారి అబ్బాయి కిరణ్‌ సినిమాటోగ్రాఫర్‌.ఇద్దరూ ఒకే సినిమాకి వర్క్‌ చేయడం నాకు డబుల్‌ హ్యాపీనెస్‌ ” అన్నారు.
 
హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి మాట్లాడుతూ – ”నా ఫస్ట్‌ ప్రొడక్షన్‌ టీజర్‌ పూరి జగన్నాథ్‌గారి చేతులమీదుగా లాంఛ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. శివగారు పూరిగారి దగ్గర వర్క్‌ చేశారు కాబట్టి ఏ లైన్‌ వినకుండా మేం ఇద్దరం కలిసి సినిమా చేశాం. ఈ క్రెడిట్‌ అంతా పూరి జగన్నాథ్‌గారికి, బి.ఎ.రాజుగారికే చెందుతుంది. ఆనీ మాస్టర్‌ నన్ను శివగారికి స‌రిచ‌యం చేశారు. ఆవిడను లైఫ్‌లాంగ్‌ మర్చిపోలేను. సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగా చేశారు. రవిగారు మంచి విజువల్స్‌ ఇచ్చారు” అన్నారు.
 
దర్శకుడు శివకుమార్‌ మాట్లాడుతూ – ”పూరిగారితో నేను చాలా సినిమాలకు వర్క్‌ చేశాను. టీజర్‌ని చూసి మా యూనిట్‌ని అప్రిషియేట్‌ చేశారు. ముఖ్యంగా సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి బాగా ఇంప్రెస్‌ అయ్యారు. పూరి గారు మా టీజర్‌ రిలీజ్‌ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే మేం అడగ్గానే సలోని మిశ్రా డేట్స్‌ అడ్జెస్ట్‌ చేసి ఇచ్చిన పూరి కనెక్ట్స్‌ పూరి, ఛార్మిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. డిఓపి రవికిరణ్‌ ముంబాయిలో వర్క్‌ చేశారు. సినిమా అంతా ఒక ముంబాయి సినిమాటోగ్రాఫర్‌ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే మంచి సెట్స్‌ వేసిన అడ్డాల రాజుగారికి థాంక్స్‌. ఎడిటర్‌ శ్యామ్‌ ప్రతి సీన్‌ కూడా క్రిస్పీలా ఉండేలా పర్‌ఫెక్ట్‌గా ఎడిట్‌ చేసి ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రూపేష్‌కుమార్‌గారికి ధన్యవాదాలు“అన్నారు.
 
రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌ జీత్‌ విర్క్‌, దేవిప్రసాద్‌, జయప్రకాష్‌, రవి వర్మ, శశిధర్‌ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్‌, పూజా రామచంద్రన్‌, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్‌ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్‌ తరుణ్‌, మాస్టర్‌ దేవాన్ష్‌, బేబి ఓజల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, యాక్ష‌న్:స‌్టంట్ జాషువ‌,చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్‌ బి