దేవ‌నార్ స్కూల్‌ పిల్లల మధ్య శివానీ పుట్టిన‌రోజు

 నా సంతృప్తి కోసం నేను, నా త‌ల్లిదండ్రులు క‌లిసి నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌న భూమి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంది. మ‌న భూమిని మ‌న‌మే కాపాడుకోవాలి. అందుక‌నే చెట్ల‌ని నాటాలి` అని అన్నారు హీరోయిన్‌ శివానీ రాజ‌శేఖ‌ర్‌. ఈమె పుట్టిన‌రోజు జూలై 1. ఈ సంద‌ర్భంగా శివానీ రాజ‌శేఖ‌ర్‌, రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంపతులు మేడ్చ‌ల్ రింగురోడ్డు వ‌ద్ద హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అలాగే దేవ‌నార్ అంధుల పాఠ‌శాల‌కు వెళ్లి అక్క‌డి పిల్ల‌ల‌ను క‌లిసి ముచ్చ‌టించారు. అక్క‌డే కేక్ క‌ట్ చేసి త‌న పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్నారు.
 
ఈ సంద‌ర్భంగా… శివానీ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “ఈ పుట్టిన‌రోజును ఇలా కొత్త‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇక‌పై ప్ర‌తి పుట్టిన‌రోజును ఇలాగే మీ మ‌ధ్య‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంటాను. ఇక్క‌డి పిల్ల‌ల తెలివి తేట‌ల్ని చూస్తుంటే ఆశ‌ర్యంగా, ఆనందంగా ఉంది. మా అందరి కంటే మీరే చాలా గ్రేట్‌“ అన్నారు. 
 
జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “ఇక్క‌డున్న పిల్ల‌లు సాధించిన విజయాలు చూస్తుంటే మేం ఇంకా ఎంతో సాధించాల‌ని అనుకోవాలి. దేవుళ్ల‌తో స‌మాన‌మైన పిల్ల‌లు మీరు. మీరింకా ఎంతో ఉన్న‌తి సాధించాల‌ని కోరుకుంటున్నాం. ఇక్క‌డ క‌డుతున్న స్కూల్‌కి మా చేత‌నైన స‌హాయం చేస్తాం“ అన్నారు. 

Shivani participates in Haritha Haram, birthday with Devanar kids 

Shivani Rajasekhar, who is doing ‘2 States’, celebrated her birthday on Sunday (July 1) by doing quality work.

“It makes me happy that I participated with my parents on my birthday in the Haritha Haram programme started by the Telangana Government.  We have to save our Earth on our own.  That’s why planting saplings is important,” the youngster said.

Shivani, along with her father Rajasekhar and mother Jeevitha, went to Medchal ring road and planted saplings.  She was also to the Devanar School for the blind and played with kids.  She cut her birthday cake over there and was visibly happy about celebrating the birthday with the school’s inmates.
“I am very happy to be here on my birthday in this way.  I am going to celebrate my birthday every year this way, amid kids.  The intelligence of these kids is amazing.  They are really special, unlike the rest of us,” Shivani said on the occasion.
Jeevitha said, “Looking at what the kids have achieved, one feels we have got to achieve so much.  These kids are like Gods.  I wish that they reach great heights in life.  Our family will do its bit for the construction of a building here.”