మీడియాలో శ్రియ‌, ఆండ్రీ పెళ్ళి ఫోటోలు, వీడియోలు !

37 ఏళ్ళ‌ వ‌య‌స్సులోను త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తున్న శ్రియ త‌న బాయ్ ఫ్రెండ్‌, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కోస్‌చీవ్‌ని వివాహం చేసుకుంద‌ని ఇటీవల ప‌లు వార్త‌లు వ‌చ్చాయి . మార్చి 12న ముంబైలోని త‌న ఇంట్లో ప్రైవేట్ స‌ర్మ‌నీగా శ్రియ త‌న బాయ్ ఫ్రెండ్‌ని వివాహం చేసుకుందని అన్నారు. ఇండ‌స్ట్రీకి సంబంధించి మ‌నోజ్ బాజ్‌పేయ్‌, అత‌ని భార్య ష‌బానా అజ్మీ మాత్ర‌మే పెళ్ళికి హాజ‌ర‌య్యార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్రీ వెడ్డింగ్ వేడుక‌ని మార్చి 11న జ‌రుపుకున్న శ్రియ‌, ఆండ్రీలు ఈ కార్య‌క్ర‌మానికి క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని మాత్ర‌మే ఆహ్వానించిన‌ట్టు తెలిసింది.

శ్రియ‌, ఆండ్రీ కోస్‌చీవ్ వివాహానికి సంబంధించిన ఫోటోల‌తో పాటు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఈ జంట పెళ్ళి చేసుకుంద‌నే వార్త‌ల‌కి సాక్ష్యం ఈ ఫోటోలే అని నెటిజన్స్ ఫోటోస్‌కి కామెంట్స్ పెడుతున్నారు. శ్రియ వివాహం హిందూ ఆచారం ప్ర‌కారం జ‌రిగిన‌ట్టు తెలుస్తుండ‌గా, పెళ్ళిలో పింక్ ఔట్‌ఫిట్‌లో ఈ అమ్మ‌డు మెరిసింది. ఇక ఆండ్రీ బ్లూ క‌ల‌ర్ కుర్తాలో క‌నిపించాడు. గ‌తంలోనే ఈ ప్రేమ జంట‌కి సంబంధించి ఎన్నో పుకార్లు బ‌య‌ట‌కి వ‌చ్చిన వారిరువురు స్పందించలేదు. త్వ‌ర‌లో ఈ దంప‌తులు సినీ సెల‌బ్రిటీల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

2001లో ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెర‌కి ఎంట్రీ ఇచ్చింది శ్రియ‌. ‘తుజే మేరీ క‌స‌మ్‌’తో శ్రియ‌  బాలీవుడ్‌కి ఎంట‌ర్ కాగా, త‌మిళంలో శివాజీ సినిమాతో కోలీవుడ్ త‌లుపు త‌ట్టింది. హిందీ, ఇంగ్లీష్ భాష‌కి సంబంధించిన ప‌లు సినిమాల‌లో నటించిన శ్రియ రీసెంట్‌గా ‘గాయ‌త్రి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చిరంజీవి, బాలకృష్ణ‌, నాగార్జున, వెంక‌టేష్ వంటి టాప్ స్టార్స్ స‌ర‌స‌న న‌టించిన శ్రియ ప్రస్తుతం ‘వీర భోగ వసంత రాయలు’, తమిళ్‌లో నరగసూరన్‌, హిందీలో ‘తడ్కా’ చిత్రాల్లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఆండ్రీ కోస్‌చీవ్ కేవ‌లం టెన్నిస్ ప్లేయ‌రే కాదు, ర‌ష్యాలోని మాస్కో ప్రాంతంలో ఓ రెస్టారెంట్‌కి ఓన‌ర్‌గా కూడా ఉన్నాడ‌ని స‌మాచారం.