దర్శకురాలు జయ బి.కు ‘సిల్వర్‌ క్రౌన్‌’ అవార్డు

ఫాస్‌ 2017 సినీ అవార్డుల్లో ప్రముఖ దర్శకురాలు, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాలో ఒక విశిష్ట స్థానాన్ని పొందిన శ్రీమతి జయ బి. గారిని ‘సిల్వర్‌ క్రౌన్‌ అవార్డు’తో సత్కరిస్తున్నామని ఫాస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.ధర్మారావు తెలియజేశారు.
23.11.2017 తేదీన శ్రీ త్యాగరాయ గానసభ హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో సెప్టెంబర్‌ 2016 నుండి సెప్టెంబర్‌ 2017 వరకు విడుదలైన చిత్రాల్లో 5 చిత్రాలు(విడుదల క్రమంలో) ‘ప్రేమమ్‌’, ‘శతమానం భవతి’, ‘ఫిదా’, ‘నిన్నుకోరి’, ‘వైశాఖం’ చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా, ఈటీవీ (సినిమా టి.వి.), జెమిని టీవీ(సీరియల్స్‌ టి.వి.), టీవీ9 (న్యూస్‌ ఛానల్‌), ఉత్తమ ఛానల్స్‌గాను, ప్రత్యేక ప్రశంస టి.వి. ఛానల్‌గా వి6(తీన్‌మార్‌ న్యూస్‌)లతోపాటు, నాలుగు దశాబ్దాల సినీ నటుడు సాయికుమార్‌కు ప్రత్యేక సత్కారం, నటుడు పృథ్వీ(బాలరెడ్డి), నటి ప్రగతి, ఉత్తమ సీనియర్‌ జర్నలిస్ట్‌గా డా. రెంటాల జయదేవ(ఆంధ్రజ్యోతి), ఉత్తమ సినీ అవార్డుల సంస్థ నిర్వాహకులుగా వంశీ రామరాజులకు అవార్డులు ప్రదానం చేయబడుతుందని కె.ధర్మారావు తెలియజేశారు. ముఖ్యఅతిథిగా పూర్వ ఛీఫ్‌ జస్టిస్‌, పాట్నా హై కోర్టు, జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రారంభకులుగా విచ్చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని టి.లలితారావుచే ‘అక్కినేని సినీ గాన వైభవం’ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఫాస్‌ ఫిలిం సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కె.ధర్మారావు తెలిపారు.
Silver Crown Award For Director Jaya B
Akkineni FAAS 2017 Cine Awards winners have been announced by K Dharma Rao, Chairman of the Akkineni FASS association. Prominent Director Jaya B has been conferred with Silver Crown Award, for her contribution to Telugu cinema highlighting Telugu values and traditions in movies. A awards function will happen on the night of November 23rd at Sri Tyagarayasabha in Hyderabad.
The Award winners are taken from the period of September 2016 to September 2017. Other winners include five best films in release order, Premam, Shatamanam Bhavati, Ninnu Kori, Fidaa,  Vaisakham. Etv, Gemini TV, and TV9 are Best Channels, special Mention to channel V6. Prominent actor from four decades, Saikumar will be honored at the function.
Actor Prudhvi, Pragati, Senior Journalist Dr. Rentala Jayadev, Vamshi Ramarajulu are among the other winners. Justice L Narasimha Reddy, retired Chief Justice Patna High Court, will be the Chief Guest of the event. Padmabhusan winner Dr. Yarlagadda Lakshi Prasad will open the function. Prominent singer T Lalita Rao will enthrall with “Akkineni Cine Gaana Vaibhavam” at function notified FAAS Chairman Sri. K Dharma Rao.