పాత్ర కోసం సాహసాలు చెయ్యడానికి వెనుకాడను !

‘గూఢచారి’లో హీరోయిన్‌గా నటించిన శోభిత ధూళిపాళ పక్కా తెలుగమ్మాయి. 2013లో ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ టైటిల్‌ కూడా సంపాదించింది. 2014లో ‘కింగ్‌ఫిషర్‌’ క్యాలెండర్‌లో బికినీతో కనిపించి మోడలింగ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌ అయింది.
 
‘గూఢచారి’ చిత్రంతో శోభిత ధూళిపాల పేరు మార్మోగిపోయింది. ఈ తెలుగమ్మాయి రొమాంటిక్‌గా నటించి ఆకట్టుకుంది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి.  ప్రతిభ ఉన్నచోటికి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తాయి. ఇప్పుడు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ శోభితకు ఓ భారీ ఆఫర్ ఇచ్చింది. ఈ బిగ్ డీల్ ఆమెకు పెద్ద రేంజులో కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ‘సాక్రిడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ సీజన్ 2కు శోభితను ఎంపిక చేసుకున్నారు. దీనికి టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను ఏరికోరి ఎంచుకున్నారు. శోభిత ఇదివరకు అనురాగ్‌తో ‘రామన్ రాఘవ్ 2.0’ కోసం పనిచేసింది. ఆ క్రమంలోనే ఈ ఆఫర్ వచ్చిందట.
న్యూడ్‌గా కనిపించి షాకిచ్చింది !
‘కింగ్‌ఫిషర్‌’ క్యాలెండర్‌లో కనిపించాక శోభిత చాలా మేగజైన్స్‌లో వరుసగా కవర్‌పేజీలపై దర్శనమిచ్చింది. ఆ సమయంలోనే ఇండియాలో పాపులర్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన అనురాగ్‌ కశ్యప్‌ తన ‘రమణ్‌ రాఘవ్‌ 2.0’ సినిమాలో శోభితికు హీరోయిన్‌ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. శోభితకూ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఆమె న్యూడ్‌గా కనిపించి షాకిచ్చింది. బాలీవుడ్‌లో ‘రమణ్‌ రాఘవ్‌ 2.0’ తర్వాత శోభితకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అనురాగ్‌ కశ్యప్‌ ప్రొడక్షన్‌లోనే మూడు సినిమాలు ఒప్పుకుంది. మాతృభాష తెలుగులో సినిమా చేయాలన్న కోరిక శోభితకు ఉంది. ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌ అయిన ‘గూఢచారి’తో ఆ కల నెరవేర్చుకుంది. మలయాళ సినీ పరిశ్రమకూ పరిచయమవుతోంది. ‘మూథన్‌’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నివిన్‌ పాలీ హీరో.
 
“పాత్ర కోసం సాహసాలు చెయ్యడానికి వెనుకాడనని చెప్తోన్న శోభిత, అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించడం ఇష్టమ”ని అంటోంది.