శ్రీనివాస్ బొగడపాటి ‘సూసైడ్ క్లబ్’ ట్రయల్ షో

శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వంలో , 3 i ఫిలిమ్స్ సమర్పణలో, ‘మజిలీ’ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘సూసైడ్ క్లబ్’… ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం, 3 i ఫిలిమ్స్ నిర్మాతలు . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతూ… సినిమాపై ఉన్న అపారమైన నమ్మకంతో ట్రయల్ షో వేసారు చిత్ర బృందం.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ… “నేను రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్ తో సినిమాటిక్ గా ‘సూసైడ్ క్లబ్’ చేసాం. కంప్లీట్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ. శివ పర్ఫెక్ట్ గా సరిపోయాడు..వెంకట్  యూనిక్ రోల్ ప్లే చేసాడు. మా యూనిట్ లో ఉన్న 80 మందిలో చందన ఒక్కరే అమ్మాయి.. చాలా బాగా చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇరగదీసాడు. ఎడిటర్ శర్వా ఎడిటింగ్ స్కిల్స్ సూపర్. త్వరలో మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నా”మని అన్నారు.
 
హీరో శివ మాట్లాడుతూ… “తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. నేను రెండింటికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. డే అండ్ నైట్ షూట్ చేసాడు డైరెక్టర్. పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ. స్టోరీ వినగానే ‘చేద్దాం’ అని చెప్పేశాను. అంత నచ్చింది. కొత్త వారి ప్రయోగాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా”ను అన్నారు.
 
వెంకట్ మాట్లాడుతూ… “నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరూ కష్టపడి చేసిన చిత్రం ఇది” అన్నారు.
 
శివ రామాచద్రవరపు,ప్రవీణ్ యండమూరి,చందన,సందీప్ రెడ్డి,వెంకట కృష్ణ, సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: కున్ని గుడిపాటి, ఎడిటర్:డిసెల్వ, ఆర్ట్:శాన్ నవార్,
విజువల్స్:పవన్ కుమార్ తడక,కుమార్ నిర్మల సృజన్, పి.ఆర్.ఓ:బి.వీరబాబు, సౌండ్: రాఘవ చరణ్.రచన- దర్శకత్వం :శ్రీనివాస్ బొగడపాటి, ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్, ప్రవీణ్ ప్రభు వెంకటేశం