అప్పుడు నోరుమూసుకునుంటే ఇప్పుడు అవకాశాలొచ్చేవి !

శ్రుతి హరిహరణ్‌… ‘ప్రస్తుతం నాతో కలిసి పనిచేయాలని ఎవరికీ లేదు. పరిస్థితులు నన్ను ఇలా సర్‌ప్రైజ్‌ చేశాయి. నాకు శత్రువులు ఏర్పడ్డారు. నేను దీన్ని సమ్మతించి.. నా మార్గంలో పోరాడుతా’ అని శ్రుతి తెలిపారు.
 
‘మీటూ’ ఉద్యమం తనకు సినిమా అవకాశాలు లేకుండా చేసిందని నటి శ్రుతి హరిహరణ్‌ అన్నారు. ఒకప్పుడు వారానికి మూడు సినిమా ఆఫర్లు వచ్చేవని, కానీ ఇప్పుడు అలా లేదని చెప్పారు. ‘కురుక్షేత్రం’ సినిమా షూటింగ్‌ సమయంలో సీనియర్‌ నటుడు అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని శ్రుతి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ఆమె ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా బయటపెట్టారు. అయితే తర్వాత తన సినీ కెరీర్‌ గురించి శ్రుతి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
 
‘నాకు జరిగిన సంఘటనలు నన్ను ఎంతో బాధపెట్టాయి. ధైర్యంగా పరిస్థితుల్నిఎదుర్కోవాల్సిన సమయం ఇది. కొన్ని నెలల ముందు వరకూ నాకు వారానికి కనీసం మూడు అవకాశాలు వచ్చేవి. విభిన్నమైన స్క్రి ప్టుల్లో నాకు నచ్చిన దాన్ని ఎంచుకునేదాన్ని. ప్రత్యేకించి కన్నడలో ఆఫర్లు బాగా ఉండేవి. నా సినిమా విడుదలై, మంచి టాక్‌ అందుకున్న తర్వాత.. నా కోసం చాలా కథలు వచ్చేవి. సెప్టెంబరులో నా కమర్షియల్‌ సినిమా విడుదలైంది. నేను అప్పుడు నోరుమూసుకుని ఉంటే (‘మీటూ’ సమయంలో) ఇప్పుడు నా కొత్త ప్రాజెక్టు గురించి మీకు చెప్పేదాన్ని’.
 
‘ప్రస్తుతం నాతో కలిసి పనిచేయాలని ఎవరికీ లేదు. పరిస్థితులు నన్ను ఇలా సర్‌ప్రైజ్‌ చేశాయి. నాకు శత్రువులు ఏర్పడ్డారు. నేను దీన్ని సమ్మతించి.. నా మార్గంలో పోరాడుతా’ అని శ్రుతి తెలిపారు.