‘బిగ్ బాస్’ కు భారీ పారితోషికం

ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ షో అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే ఆ కార్యక్రమం ప్రసారం కూడా కాబోతోంది. మరి, ఆ షోకు గానూ తారక్ రూ.9 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎపిసోడ్ ప్రకారం తారక్‌కు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తొలి సీజన్లో భాగంగా 13 ఎపిసోడ్లను ప్రసారం చేయనున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.50 లక్షల చొప్పున.. 13 ఎపిసోడ్లకు రూ.6.5 కోట్లు ఎన్టీఆర్ జేబులో పడుతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వారిలో.. అత్యధిక పారితోషికం అందుకోబోతున్న హోస్ట్‌గా తారక్ నిలవబోతున్నాడు. ప్రతి శనివారం ఈ ప్రోగ్రాం ప్రసారం కాబోతోంది.